కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ కథలను ఎంచుకోవడంతోనే ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటాడు. సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యేవరకు ప్రతి విషయాన్నీ హైలెట్ చేసే విధంగా ధనుష్ కొత్తగా అడుగులు వేస్తుంటాడు. సినిమా రిలీజ్ అనంతరం రిజల్ట్ లో తేడా వచ్చినప్పటికీ ధనుష్ ప్రయత్నాలకు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ రావు.

ధనుష్ కి నచ్చితే ఎలాంటి కథనైనా సెట్స్ పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అయితే నెక్స్ట్ ధనుష్ ఎవరు ఊహించని విధంగా మొదటిసారి తన మామయ్య సినిమాని మళ్ళీ తెరపైకి తీసుకురాబోతున్నాడు. అంటే రీమేడ్ చేయబోతున్నాడు. 1981లో విడుదలైన రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘నెట్రి కాన్’ తమిళ ప్రేక్షకులు ఏ మాత్రం మర్చిపోలేరు. అయితే అదే కథను మళ్లిఈ కొత్తగాతెరకెక్కించాలని ధనుష్ ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

అంటే ధనుష్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడన్నమాట. అప్పట్లో ఎస్పీ.ముత్తురామన్ డైరెక్ట్ చేసిన ఆ చిత్రంలో రజనీ డబుల్ రోల్ చేశారు. ఇకపోతే ఎ కొత్త సినిమాలో కీర్తి సురేష్ ధనుష్ కి జోడిగా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే 'మారి' డైరెక్టర్ సెల్వరాజ్ తో కూడా ఒక సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల అనంతరం ధనుష్ రజినీ పాత కథను సెట్స్ పైకి తీసుకురానున్నాడు.