కరోనా ఎఫెక్ట్ సినీ రంగం మీద చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌లతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా ఆగిపోవటంతో ఇండస్ట్రీ తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోతోంది. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ లు ముగించుకొని రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అవి ఎప్పుడూ రిలీజ్ అవుతాయో ఇప్పట్లో చెప్పే పరిస్థితి లేదు. ఇక చిత్రకరణ దశలో ఉన్న సినిమాల పరిస్థితి మరీ దారుణం. ఈ పరిస్థితుల్లో ఓ యంగ్ హీరో సాహసం చేశాడు. తన  సినిమాను డైరెక్ట్‌ గా ఆన్‌ లైన్‌ లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

హీరో టాలీవుడ్‌లో పరిచయం అయినా తమిళ్‌లో సక్సెస్‌ అయిన యంగ్ హీరో సందీప్‌ కిషన్‌. ఈ యువ నటుడు హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్  మూవీ నరగసూరన్‌. 2017లో ప్రారంభమైన ఈ సినిమా మూడు నెలల్లోనే పూర్తయ్యింది. అయితే అప్పటి నుంచి వివిధ కారణాలతో రిలీజ్‌ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇటీవల మార్చి 27న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ అదే సమయంలో లాక్ డౌన్‌ ప్రకటించటంతో సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది.

అయితే ఇక థియేటర్‌లో రిలీజ్ చేయటం ఇప్పట్లో సాధ్యం కాదని భావించారో ఏమో.. సినిమాను డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కార్తీక్‌ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌, అరవింద్‌ స్వామి, శ్రియ శరన్, ఆద్మిక, ఇంద్రజిత్ సుకుమారన్‌లను కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాను ఏప్రిల్ 17న డైరెక్ట్‌గా అమేజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్ చేయాలని ఫిక్స్‌ అయ్యారు చిత్రయూనిట్. దీంతో ఇలా థియేట్రికల్‌ రిలీజ్‌ లేకుండా డైరెక్ట్‌గా డిజిటల్‌ లో రిలీజ్ అవుతున్న తొలి సినిమా నరగసూరన్‌ రికార్డ్ సృష్టించనుంది. ఈ ఘనత సాదించిన తొలి హీరోగా సందీప్ నిలిచిపోయాడు. ఈ సినిమా తెలుగులో కూడా నరకాసుడు పేరుతో రిలీజ్‌ కానుంది.
Narakaasurudu First Look Out Now | Telugu Filmnagar