దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ కొనేళ్లపాటు ప్రేమలో మునిగితేలారు. చివరగా 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళైన తర్వాత కూడా దీపికా, రణవీర్ సింగ్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల కొన్ని రోజుల నుంచి దీపిక గర్భవతి అయినట్లు బాలీవుడ్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

దీనిపై దీపికా పదుకొనె తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. పెళ్లైన తర్వాత ఇలాంటి వార్తలు రావడం సహజమే. కానీ వాటిని నేను పట్టించుకోను. నేను, రణవీర్ ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. పిల్లలంటే మాకు ఇష్టమే. కానీ మేమిద్దరం ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టినట్లు దీపిక తెలిపింది.

ప్రస్తుతం మేమిద్దరం పిల్లల గురించి ఆలోచించడం లేదు. సరైన సమయంలో పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటాం అని దీపిక తెలిపింది. దీపికా, రణవీర్ ప్రస్తుతం కపిల్ దేవ్ బయోపిక్ చిత్రం 83లో జంటగా నటిస్తున్నారు.