బ్యూటీ క్వీన్ గా ప్రస్తుతం బాలీవుడ్ ని దీపికా ఏలుతోంది. అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోంది. గతంలో దీపికాపై అనేక లవ్ ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. రామ్ లీలా చిత్రంలో దీపికా రణవీర్ జంటగా నటించారు. 

చాలా కాలం పాటు ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఓ దశలో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై దీపికా పదుకొనె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. రణవీర్, తాను వివాహానికి ముందు సహజీవనం చేయలేదని తెలిపింది. 

మేమిద్దరం సహజీవనం చేయకపోయాడానికి కారణం ఉంది. పెళ్ళికి ముందే ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి సహజీవనం చేస్తారు. ఆ పద్ధతి నాకు నచ్చదు. పెళ్లి ముందే అంతా తెలుసుకుంటే.. వివాహం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇంకేం ఉటుంది అని దీపికా ప్రశ్నించింది. 

వివాహం అంటే నచ్చని వారు సహజీవనం చేస్తారు. కానీ నాకు, రణవీర్ కు వివాహ వ్యవస్థపై నమ్మకం ఉంది. అందుకే పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం తామిద్దరం భార్యాభర్తలుగా వివాహజీవితాని ఆస్వాదిస్తునట్లు దీపిక తెలిపింది. ప్రస్తుతం వీరిద్దరూ కపిల్ దేవ్ బయోపిక్ చిత్రం 83లో నటిస్తున్నారు.