బిగ్ బడ్జెట్ సినిమాల్లోనే కాకుండా డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ దీపికా పదుకొనె. గతంలో ఎవరు చేయని ఒక ప్రయోగాత్మకమైన కథలో దీపిక నటించింది. యాసిడ్ దాడికి గురైన ఒక అమ్మాయి పాత్రలో నటించింది. చాపక్ అనే ఆ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.  సినిమాలో దీపిక కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు.

15 ఏళ్ల వయసులో  యాసిడ్ దాడికి గురైన లక్ష్మి అగర్వాల్ పాత్రను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. స్టాప్ సేల్ యాసిడ్ అనే నినాదంతో యాసిడ్ ల విక్రయాన్ని ఆపేసిన ఘనత ఆమెది. అప్పటి నుంచి యాసిడ్ ఘటనలు తగ్గాయి. తనను ప్రేమించలేదని నయీమ్ ఖాన్ అనే వ్యక్తి లక్ష్మిపై యాసిడ్ దాడి చేశాడు. అయితే ఎంతో మనోవేధనలో కూడా లక్ష్మి దైర్యంగా నిలబడి కొత్త తరహాలో జీవితాన్ని గెలిచి అందరికి ఆదర్శంగా నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా ఆమె యాసిడ్ ఘటనలు జరగకూడదని ప్రచారాలను మీటింగ్ లను నిర్వహించి యాసిడ్ బాధితులకు సైతం అండగా నిలిచింది.  అలాంటి వనిత పాత్రలో దీపిక పదుకొనె నటించి దేశాన్ని ఆకర్షించింది. రాజి సినిమాతో దర్శకురాలిగా మంచి ప్రశంసలు అందుకున్న మేఘన గుల్జర్ ఆ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇకపోతే ఫాక్స్ స్టార్ స్టూడియోస్ తో కలిసి దీపిక సొంతంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 10న చాపక్ సినిమా రిలీజ్ కానుంది.