రెండు గంటలు మాట్లాడుకున్నాం.. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం
దీపికా చిఖలియా అనేది ఆమె అసలు పేరు.. కానీ ఆమె అభినవ సీతగా మారిపోయింది. అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 80వ దశకంలో ప్రసారం అయిన రామాయణం టివి సిరీస్ ఎంతగా పాపులర్ అయిందో అందరికి తెలిసిందే.
దీపికా చిఖలియా అనేది ఆమె అసలు పేరు.. కానీ ఆమె అభినవ సీతగా మారిపోయింది. అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 80వ దశకంలో ప్రసారం అయిన రామాయణం టివి సిరీస్ ఎంతగా పాపులర్ అయిందో అందరికి తెలిసిందే.
దర్శకుడు రామానంద్ సాగర్ ఆ సీరియల్ ని అద్భుత దృశ్య కావ్యంలా అందించారు. ఇటీవల లాక్ డౌన్ కారణంగా రామాయణంని తిరిగి ప్రసారం చేయగా ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీవీ షోగా రికార్డ్ సృష్టించింది. ఈ సీరియల్ లో ప్రముఖ నటి దీపికా చిఖలియా సీత పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆమె అప్పటి సంగతులని ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు.
తాజాగా ఓ దీపికా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర సంఘటన వివరించారు. తాం భర్తతో తొలి పరిచయం గురించి దీపికా అభిమానులతో పంచుకున్నారు. దీపికా భర్త హేమంత్ టోపీవాలా. నేను ఆయన్ని 1983లో సున్ మేరీ లైలా అనే చిత్ర షూటింగ్ లో చూశాను. మళ్ళీ ఆయన్ని చూసింది 1991 ఏప్రిల్ 28 న. ఆ రోజు మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం.
మాతో పాటు తెలిసిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. కొంత సమయానికి వాళ్లంతా లేచి వెళ్లిపోయారు. దీనితో మేమిద్దరమే అక్కడ ఉన్నాం. దాదాపు రెండు గంటల పాటు మాట్లాడుకున్నాం.. అంతే ఇద్దరం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాం అని దీపికా తెలిపింది. ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు అనే విషయాన్ని మాత్రం దీపికా వివరించలేదు.