లాక్‌డౌన్ ప్రభావంతో చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా హోం క్వారంటైన్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జనాలు ఎంటర్టైన్మెంట్ ని వెతుక్కుంటున్నారు. అందులో భాగంగా తాజాగా క్వారంటైన్ పిల్లో ఛాలెంజ్ అంటూ ఒక‌టి మొదలెట్టారు.. అదికాస్త ఇంటర్ నెట్ లో  వైరల్‌గా మారింది. ఎందుకంటే మాంచి హాట్ స్టఫ్ ఈ ఛాలెంజ్ తో జనాలకు దొరుకుతోంది. మీరు ఇనిస్ట్ర ఫాలో అయితే ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి...మీకు అసలు ఆ ఛాలెంజ్ పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఆమె దెబీనా బెనర్జీ అనే  ఓ బెంగాళీ టీవి హీరోయిన్. ఆమె ఈ ఛాలెంజ్ ని వదిలి తన అభిమానులను తన వైపుకు తిప్పుకుంటోంది. ఈమెను ఇప్పుడు చాలా మంది ఫాలో అయ్యి ఛాలెంజ్ వదులుతున్నారు.

ఇంతకీ ఈ ఛాలెంజ్ చేయాలంటే చాలా సింపుల్...మనం ప‌డుకునేట‌పుడు త‌ల కింద పెట్టుకునే దిండు (పిల్లో)ను డ్రెస్ గా పెట్టుకుని ఫొటో దిగాలన్నమాట. చాలా మంది  అమ్మాయిలు దిండును డ్రెస్ గా వేసుకుని..దానికి బెల్ట్ బిగించి..ఆ కాస్ట్యూమ్స్ లో ఫొటోలు, సెల్ఫీలు దిగుతున్నారు. ఆ స్టిల్స్‌ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయ‌డంతో అవి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  

 ఇప్పటికే.. చాలా మంది అమ్మాయిలు ఈ ఛాలెంజ్‌లోకి దిగిపోయా రచ్చ రచ్చ చేస్తున్నారు.. పిల్లోను అలా సరదాగా పట్టుకుని అమ్మాయిలు.. డ్రెస్‌గా ధరిస్తున్నారు.. అంటే.. పిల్లును తమ శరీర ముందు భాగంలో అడ్డం పెట్టుకుని... అది ఊడిపోకుండా బెల్ట్‌లు బిగించి.. ఆ కాస్ట్యూమ్స్‌లో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ.. సోషల్ మీడియాలో వదులుతున్నారు.. మరోవైపు.. ఒకరు విసిరిన ఛాలెంజ్‌ను మరికొందరు స్వీకరిస్తూ.. ఇంకా కొందరికి ఆ ఛాలెంజ్ విసురుతూ సాగుతుండడంతో.. అవి వైరల్‌గా మారాయి.