డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన చిత్రం పోకిరి. మునుపెన్నడూ చూడని విధంగా మహేష్ బాబుని పూరి ఆ చిత్రంలో ప్రజెంట్ చేశారు. సినిమా అంతా ఒకెత్తయితే ఆ చిత్రంలో మహేష్ బాబు చెప్పే డైలాగ్స్ ఒకెత్తు. 

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మెయిడ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు.. ఎప్పుడొచ్చావన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను లాంటి సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. 

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇటీవల తెలుగు సినిమాలపై మక్కువ చూపిస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం వార్నర్ తన భార్యతో కలసి బుట్టబొమ్మ సాంగ్ కు స్టెప్పులేసిన వీడియో అందరిని ఆకట్టుకుంది. 

తాజాగా వార్నర్ పోకిరి చిత్రంలో మహేష్ బాబు డైలాగ్ చెబుతూ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో వార్నర్.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ బ్యాట్ చూపిస్తూ డైలాగ్ అద్భుతంగా చెప్పాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Guess the movie?? I tried everyone 🤷🏼‍♂️🤷🏼‍♂️Good luck 😂😂 #tollywood #requested #helpme #

A post shared by David Warner (@davidwarner31) on May 9, 2020 at 11:57pm PDT

వార్నర్ చెప్పిన ఈ డైలాగ్ పూరి జగన్నాధ్ ని బాగా ఆకట్టుకుంది. వార్నర్ వీడియోపై పూరి జగన్నాధ్ సోషల్ మీడియాలో స్పందించాడు. మిస్టర్ డేవిడ్ నీవేంటో ఈ వీడియో తెలియజేస్తోంది. మొండి పట్టుదల గల మనిషివి. ఆ డైలాగ్ నీ వ్యక్తిత్వానికి బాగా సూట్ అవుతుంది. నీలో మంచి నటుడు కూడా ఉన్నాడు. దయచేసి నా చిత్రంలో ఒక చిన్న పాత్ర అయినా చేయి అని పూరి వార్నర్ ని రిక్వస్ట్ చేశాడు.