కరోనా ప్రభావంతో ప్రస్తుతం ప్రపంచం మొత్తం లాక్ డౌన్ పాటిస్తోంది. దీనితో సామాన్య ప్రజలు, సెలెబ్రిటీలు అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. సెలెబ్రిటీలు ఇళ్లలోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులని ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

మైదానంలో బౌలర్లపై చిచ్చర పిడుగులా రెచ్చిపోయే వార్నర్ ప్రస్తుతం ఇంట్లో తన భార్యతో కలసి రచ్చ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా వార్నర్ టాలీవుడ్, బాలీవుడ్ సినిమా పాటలు, డైలాగులతో టిక్ టాక్ వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Who was better @candywarner1 and I or @theshilpashetty 😂😂 #theoriginals @prabhudevaofficial

A post shared by David Warner (@davidwarner31) on May 17, 2020 at 1:19am PDT

తాజాగా వార్నర్ ప్రేమికుడు చిత్రంలోని ప్రభుదేవా సూపర్ హిట్ ముక్కాలా ముక్కాబుల అనే సాంగ్ ని టిక్ టాక్ వీడియో చేశాడు. వార్నర్ తాన్ భార్యతో కలసి చేసిన స్టెప్పులు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. 

ఈ వీడియోని ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వార్నర్.. పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టిని టార్గెట్ చేస్తూ అభిమానులకు ఓ ప్రశ్న సంధించాడు. శిల్పా శెట్టి గతంలో ఇదే సాంగ్ కు టిక్ టాక్ వీడియో చేసింది. ఈ పాటకు ఎవరు డాన్స్ బాగా చేశారు అని ప్రశ్నించాడు. శిల్పా శెట్టి తెలుగువారికి సుపరిచయం అయిన హీరోయినే. తెలుగులో ఆమె వెంకటేష్ సరసన సాహసవీరుడు సాగర కన్య అనే చిత్రంలో నటించింది.