ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన స్టామినా పవర్ చూపిస్తున్నాడు. సొంత గడ్డ తమిళనాడులో దర్బార్ సినిమా కలెక్షన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అయితే తెలుగులో మాత్రం సినిమా అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. సంక్రాంతికి తెలుగులో పెద్ద సినిమాలు ఉన్నప్పట్టికీ తలైవా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా దర్బార్ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేశారు.

మురగదాస్ దర్శకత్వంలో చేసిన దర్బార్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల  ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. రజిని గత సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం కనపడలేదు.  లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రెండు రోజుల్లో సినిమా 4.5కోట్ల షేర్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇక శనివారం సరిలేరు నీకెవ్వరు రిలీజ్ కావడంతో తలైవా సినిమా కలెక్షన్స్ తగ్గుతున్నాయి. సినిమాకు  ఓ వర్గం నుంచి పాజిటివ్ టాక్ వస్తున్నప్పటికీ సంక్రాంతికి నెలకొన్న తీవ్రమైన పోటీలో దర్బార్ కలెక్షన్స్ పెరగడం అంత సులువు కాదు.  సినిమా తెలుగులో 14కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మినిమమ్ 15కోట్ల షేర్స్ అందుకుంటేనే బయ్యర్స్ సేఫ్ జోన్ లోకి రాగలరు. మరీ సినిమా బాక్స్ ఆఫీస్ ఫిట్ లో ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి. ఇక ఆదివారం అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో దర్బార్ కి కొన్ని థియేటర్స్ తగ్గే అవకాశం ఉంది.