ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో నీరిపించాడు. మురగదాస్ దర్శకత్వంలో చేసిన దర్బార్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల  ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. రజిని గత సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం కనపడలేదు.

తమిళనాడులో బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. దాదాపు 15కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క చెన్నైలోనే దర్బార్ కోటికి పైగా అందుకున్నట్లు సమాచారం. ఇక తెలుగులో రజినీకాంత్ సినిమాకు పెద్దగా బజ్ లేకపోయిన్నప్పటికీ పర్వాలేదనిపించే విధంగా రాబట్టినట్లు టాక్, ముఖ్యంగా నైజంలో కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వీకెండ్ లో సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. మొత్తంగా సినిమా వరల్డ్ వైడ్ గా 30 నుంచి 35కోట్ల వరకు అందుకున్నట్లు టాక్ వస్తోంది.

ఇదే తరహాలోకొనసాగితే దర్బార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. తమిళ్ అయితే సంక్రాంతి సెలవులు సినిమాకు మరింత బూస్ట్ ఇవ్వనుంది. కానీ తెలుగులో  మాత్రం ఎంతవరకు క్లిక్కవుతుందనేది సందేహంగా మారింది. ఎందుకంటె పోటీగా సరిలేరు నీకెవ్వరు - అల వైకుంఠపురములో - ఎంత మంచివాడవురా! సినిమాలు ఒక దాని తరువాత మరొకటి విడుదల కానున్నాయి. లోకల్ గా తెలుగు సినిమాలకు భారీగా డిమాండ్ ఉండడంతో దర్బార్ సినిమా ఏ మేర వసూళ్లు అందుకుంటుంది అనేది చూడాలి.