Dam Doom Daiyya: టెక్ మావెరిక్ జైకే విడుదల చేసిన 'డామ్ డూమ్ డ‌య్యా' అనే సింగిల్ మ్యూజిక్ వీడియో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ సాంగ్ విమ‌ర్శ‌కుల‌ ప్రశంసలు అందుకుంటోంది. ఈ వీడియో బృందం ఏషియానెట్ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. 

Dam Doom Daiyya: 'డామ్ డూమ్ డ‌య్యా'తో సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టడం ద్వారా టెక్కీ స్టీరియోటైప్ ను బ్రేక్ చేసేందుకు జైకే ఇక్కడకు వచ్చారు. వివిధ సాంకేతిక పురోగతి వెనుక చోదక శక్తిగా, మనిషికి ఇంకా ఏదో శ‌క్తి ఉందని నమ్మించే అతని కొత్త అవతారాన్ని మనం చూస్తాము. ఎందుకంటే లైకా ప్రొడక్షన్స్ తో కలిసి హిందీ, తమిళం, ఇంగ్లిష్ భాషలకు భిన్నంగా పూర్తిగా కొత్త బహుభాషా నేపథ్యాన్ని ఆవిష్కరించిన మ్యూజిక్ వీడియో సాంగ్ 'దమ్ డూమ్ డ‌య్యా'. ఈ మ్యూజిక్ వీడియోలో జైకే పోషించిన ఒక తండ్రి తన కుమార్తెను యుక్త వ‌య‌స్సు దాటి అంద‌మైన యువ‌తిగా మారుతున్న ఎదుగుద‌ల‌ను చూపించే విధంగా ఈ వీడియో సాంగ్ ఉంటుంది. ఈ వీడియో బృందం ఏషియానెట్ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

జైకేను ఈ స‌రికొత్త కాన్సెప్ట్, ఈ అంశం గురించిన ఆలోచ‌న పుట్టుకురావ‌డం గురించి ప్ర‌శ్నించగా.. "నేను చిన్ననాటి నుంచి సంగీత ప్రియుడిని. సంగీతం నా జీవితంలో అంతర్భాగం. నేను సంగీతకారుల కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న సైంటిస్టు అయినా పాడేవారు. నాకు ఎంబీఏలు ఉన్న కజిన్స్ ఉన్నారు, వారంతా పాడతారు. నా చుట్టూ ఎప్పుడూ సంగీతం, సంగీత విద్వాంసులు ఉంటారు. కాబ‌ట్టి నేను దీన్ని త్వరగా చేసి ఉండాల్సిందని చెప్పారు. ఈ పాటకు అందించ్చిన సహకారం గురించి మాట్లాడుతూ.. ''గత ఏడాది మేమంతా కలిసి ఓ మ్యూజిక్ వీడియో తీయాలని నిర్ణయించుకున్నాం. మ్యూజిక్ వీడియో డైరెక్టర్ల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. జిమింగ్ (దర్శకుడు) ఈ ప్రాజెక్టుకు అంగీకరించాడని'' తెలిపారు.

YouTube video player

తన కుమార్తెను ఈ ప్రాజెక్టు లోకి చేర్చుకునే విష‌యం గురించి జైకే మాట్లాడుతూ.. "నేను నిజంగా ఈ పని చేయడానికి ఆమెను ఒప్పించాల్సి వచ్చింది. ఆమె చాలా టాలెంటెడ్. ఆమె మొద‌టిసారి స్టూడియోలోకి వెళ్ళింది. రెండు గంటల్లోనే, మేము ఆమె పాటను పూర్తి చేసాము. నిజానికి, మేము కూడా ఆమెను మ్యూజిక్ వీడియోలో భాగం చేయ్యాల‌ని ప్రయత్నించాము, కానీ దానికి నిరాకరించింది" అని నవ్వుతూ చెప్పారు. మ్యూజిక్ వీడియోకు ప్రాణం పోసే ప్రక్రియను గురించి మాట్లాడుతూ.. ఇది ఒక సమిష్టి ప్రయత్నమ‌ని జిమింగ్ తెలిపారు. ప్రారంభంలో దానితో సరదాగా గడపాలనే ఆలోచన మాకు బాగా నచ్చింది... ఈ సరదా దృశ్యాలన్నింటినీ దాటడంతో ఈ అబ్సెసివ్ తండ్రి ఓవర్ ది టాప్ కథను తయారు చేయడం జ‌రిగింద‌ని'' తెలిపారు. 

లొకేషన్ స్కౌటింగ్ గురించి అడిగినప్పుడు, జిమింగ్ మాట్లాడుతూ.."ఇది ఉద్యోగ ఆచరణాత్మక వైపు. మాకు పరిమితంగానే బడ్జెట్ ఉంది. చాలా సన్నివేశాలను జైకే ఉన్నా ప‌రిస‌రాల్లో, వారి పెరట్లో చిత్రీకరించాము. చివరి నిమిషంలో క్లబ్ సీన్ కు లొకేషన్ కూడా దొరికింది.. అక్క‌డే వీధిలోని మరో క్లబ్ కూడా మా కోసం ద్వారాలు తెరిచిందని' తెలిపారు. ఈ మ్యూజిక్ వీడియో వైవిధ్యం గురించి ప్ర‌శ్నించ‌గా, "ఇది సాంస్కృతికంగా చాలా వైవిధ్య స్పృహతో ఉంది. మొత్తం ప్రొడక్షన్ క్రూ ఒక అంతర్జాతీయ బృందం, చాలా వైవిధ్యంతో ఉంటూ మేము మా వనరులను సద్వినియోగం చేసుకోవ‌డంతో ప్రేక్షకులకు ఏదైనా చూపించగలగాలి అని మాకు తెలుసు. దీనికి భారతీయ ప్రేక్షకులు, ప్ర‌తి తండ్రి, కుమార్తె కూడా క‌నెక్ట్ కావాలి. ఇందులో స్థానిక‌త‌ను జోడించ‌డంతో ప‌లువురిని భాగం చేశామ‌ని'' అన్నారు. 

జైకేను రాక్ స్టార్ గా చూడటంపై స్పందిస్తూ.. 'అది ప్రేక్షకులే నిర్ణయించాలి. నేను టెక్కీని కావాలని అనుకుంటున్నాను, నా ఉద్యోగాన్ని విడిచిపెట్టే ఆలోచన నాకు లేదు, అదే సరదాకు నిధులు సమకూరుస్తోంది. ఈ పాట చాలా మానవీయమైనది. జైకే, తని కుమార్తెకు ఒక ప్ర‌త్యేక‌ బంధం అనుభవం" అని జెఫ్ హువాంగ్ అన్నారు. చాలా మంది 9-5 ఉద్యోగం చేస్తుంటారు కానీ వారు ప్ర‌త్యేక‌ అభిరుచిని కలిగి ఉంటారు. వారికి జట్టు ఎలాంటి సందేశం ఇచ్చిందని అడిగ్గా.. దీనిపై జైకే స్పందిస్తూ.. 'మీకు అభిరుచి ఉంటే అది పైచేయి సాధిస్తుంది. ఇది ముందుకు వచ్చి మీ కోసం చేస్తుంది. మీరు దానిని కొనసాగించాలి. అప్పుడు మీరు సౌకర్యవంతంగా ఉంటారు. దానిని పూర్తి చేయడానికి మీలో శ‌క్తి ఉంటుందన్నారు. తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి జైకే మాట్లాడుతూ... ''మా దగ్గర కొన్ని ట్రాక్స్ రెడీగా ఉన్నాయి. మ్యూజిక్ వీడియోను కాన్సెప్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామ‌ని'' చెప్పారు.