బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'దబాంగ్ 3'. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. ఇందులో భాగంగా 'మున్నా బద్మాన్ హువా' అంటూ సాగే ఓ స్పెషల్ సాంగ్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట విడుదల సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

నమిత స్టన్నింగ్ లుక్స్.. వైరల్ అవుతున్న హాట్ ఫోజులు!

అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా సల్మాన్ అభిమానులతో పంచుకున్నారు. నటి వరీనా హుస్సేన్ ఈ పాటలో సల్మాన్ తో ఆడిపాడింది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన 'హుద్ హుద్ దబాంగ్' పాట విషయంలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుండి అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఈ పాటలో పలువురు కాషాయ వస్త్రాలు ధరించి కనిపించారు. దీంతో ఈ పాట విషయంలో హిందూ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.