ప్రముఖ నటి తాప్సీ నటించిన 'తప్పడ్' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన వారంతా చిత్రబృందాన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. మంచి రివ్యూలు కూడా వస్తున్నాయి.

అయితే బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ మాత్రం సినిమాపై నీచమైన విమర్శలు చేశారు. సినిమా చూసిన అరగంటలోపే అసలు ఏం జరుగుతుందో అర్ధం కాలేదని.. ఇంటర్వెల్ వచ్చేసరికి సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదు. 'ఆ.. తూ..' ఇదొక సినిమానా..? అంటూ నీచమైన కామెంట్స్ చేశాడు.

సీరత్ కపూర్ స్కిన్ షో (వైరల్ ఫొటోస్)

సినిమాని వినోదం కోసం చూస్తాం కానీ ఇలా చివరి వరకు బోర్ కొట్టి చావడానికి కాదని అన్నారు. ఈ సినిమాతో మగవాళ్లకు, ఆడవాళ్లకు, సమాజానికి ఎలాంటి సంబంధం లేదని.. దర్శకుడు అనుభవ్ సిన్హా తన వ్యక్తిగత జీవితాన్ని సినిమాగా మార్చారని.. మా పబ్లిక్ జీవితం మీలాగా లేదు సర్ అంటూ కౌంటర్ వేశాడు. మీరు ఉన్నతమైన వ్యక్తి కాబట్టి మీ జీవితాన్ని మీ వద్దే ఉంచుకోండి అంటూ ట్వీట్ చేశారు.