భారత క్రికెటర్ మనీష్ పాండే వివాహం సోమవారం వైభవంగా జరిగింది. ఈ 30 ఏళ్ల క్రికెటర్ ఓ ఇంటివాడయ్యాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించిన మనీష్ పాండే క్రికెట్ లో ప్రతిభ చాటుతూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకున్నాడు. మనీష్ పాండే ప్రస్తుతం ఉన్న ప్రతిభగల యువ క్రికెటర్స్ లో ఒకడు. 

మనీష్ పాండే వివాహం కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ముంబైలో జరిగింది. మనీష్ పాండే వివాహం చేసుకున్నది ముంబైకి చెందిన యంగ్ హీరోయిన్ ఆశ్రిత శెట్టిని. ఆశ్రిత శెట్టి తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆశ్రిత ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. 

ఆశ్రిత మొదట 2012లో తుళు భషలో తెరకెక్కిన 'తెలికెద బొల్లి' చిత్రంలో నటించింది. తమిళంలో ఇంద్రజిత్, ఓరు కన్నియమ్ లాంటి చిత్రాల్లో మెరిసింది. 

మనీష్ పాండే ఐపీయల్ లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మనీష్ పాండే, ఆశ్రిత వివాహబంధంతో ఒక్కటి కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపింది.