రాఖీ బాయ్ ఫైరింగ్ షూరు అయ్యింది. కేజీఎఫ్  ఛాప్టర్ 2 నుంచి వరుస అప్డేట్స్ ను అందిస్తున్నారు మేకర్స్. ఈ నెల 3న ట్రైలర్ రిలీజ్ డేట్ ను అన్సౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో క్రేజీ అప్డేట్ ను అందించారు. ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

కేజీఎఫ్ చాప్టర్ 1 (KGF 1)తో ఆల్ ఇండియా రేంజ్ లో యష్ (Yash) తన పాపులారిటీ సాధించుకున్నాడు. రాఖీ బాయ్ గా అగ్రెసివ్ అటీట్యూడ్ తో ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకున్నాడు. 2018లో కేజీఎఫ్ చాప్టర్ 1 రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా రాఖీ బాయ్ ట్రెండ్ నడుస్తూనే ఉంది. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2) తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ మూవీ విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ఆడియెన్స్ అటెన్షన్ ను డ్రా చేసేందుకు మేకర్స్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

కేజీఎఫ్ రిలీజ్ అయ్యి మూడేళ్లు పైనే అవుతున్నా ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అంటే సినిమా ఆడియన్స్ ను ఎంతలా మెస్మరైజ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కేజీఎఫ్ ఛాప్టర్ 2 కోసం మూడు సంవత్సరాలుగా అభిమానులు, సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా వల్ల డిలే అవుతూ వస్తున్న కేజీఎఫ్ 2ను ఫైనల్ గా ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మార్చి 3న అనౌన్స్ మెంట్ అందిస్తూ అన్ని భాషల్లో ట్రైలర్ ను మార్చి 27న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అయితే ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ నుంచి మరో క్రేజీ అప్డేట్ ను అందించారు. 

ట్రైలర్ కు ముందే రాఖీ భాయ్ ఫైరింగ్ షూరు అయ్యేలా ఓ పవర్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ‘తుఫాన్’(KGF Toofan) టైటిల్ తో ఈ లిరికల్ వీడియో రిలీజ్ కానుంది. మార్చి 21 ఉదయం 11.07 నిమిషాలకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఇందుకు అప్డేట్ అందిస్తూ ‘తుఫాను వస్తోంది.. సిద్ధంగా ఉండండి’ అంటూ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సూచన చేశారు. దీంతో యష్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. మరో మూడు రోజుల్లో విడుదల కానున్న ‘తుఫాన్’ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని మార్చి 27న సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Scroll to load tweet…

మరోవైపు, కేజీఎఫ్ రిలీజ్ కు ముందే మంచి బిజినెస్ చేస్తోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 బిగ్గేస్ట్ హిట్ కావడంతో.. ఛాప్టర్ 2 రైట్స్ ను దక్కించుకునేందుకు ‘సరిగమ’ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకుబ్లాక్‌బస్టర్ మూవీస్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సరిగమ (Sarigama) ప్రతిష్టాత్మకమైన మరియు మోస్ట్ ఎవైటెడ్ కేజీఎఫ్2 ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పటికే RRRఓవర్సీస్‌లో 1,150 స్క్రీన్‌లతో యునైటెడ్ స్టేట్స్‌తో పెద్ద ఎత్తున సరిగమా ద్వారా పంపిణీ చేయబడుతోంది. ఇక కేజీఎఫ్2 కూడా ఓవర్సీస్ లో మరోసరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నట్టు తెలుస్తోంది.