పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను, తన ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. ప్రభాస్ - డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ కామెడీ ఎంటర్ టైనర్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది. 

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బహుబలి (Bahubali) తర్వాత పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. అప్పటి నుంచి భారీ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్స్ లైన్ అప్ దిమ్మతిరిగిపోతోంది. చివరిగా తన సొంత బ్యానర్ లో వచ్చిన ‘రాధే శ్యామ్’(Radhey Shyam)తో ఫ్యాన్స్ ను కొంత నిరాశ పర్చినా.. తన అప్ కమింగ్ ఫిల్మ్స్ పై పక్కాగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల తన మోకాలి శస్త్ర చికిత్స కోసం ఫారెన్ వెళ్లాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. షూటింగ్ కు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

అయితే, ప్రభాస్ బహుబలి తర్వాత వరుసగా భారీ కథాంశాల చిత్రాల్లో, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో డార్లింగ్ కాస్తా రిలీఫ్ కోసం అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాలో నటించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతీ (Maruthi) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను పరిశీలించినట్టు తెలుస్తోంది. 

అయితే వీరిద్దరి కాంబోలో సినిమా కన్ఫమ్ అయినప్పటి నుంచి ఎలాంటి కదలికలు కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ అప్డేట్స్ గురించి ఎదురుచూస్తున్నారు. కాగా, ఇంటర్నెట్ లో ప్రభాస్ -మారుతీ కాంబోపై క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు రావాలంటే చాలా సమయమే పడుతుందంట. షూటింగ్ వచ్చే ఏడాద 2023లోనే ప్రారంభం కానునుందని, సరిగ్గా ఏడాది సమయంలోనే చిత్రీకరణ పూర్తి చేసి 2024 సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సినీ వర్గాల నుంచి సమాచారం. ఈ మూవీ సబ్జెక్ట్ ఎక్కువగా స్థానికంగా ఉంటుందని, సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్టు టాక్. ఈ విషయాలపై ప్రస్తుతానికి ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. 

ప్రభాస్ ప్రస్తుతం కన్నడ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘సలార్’ Salaar చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పార్ట్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్. ఇప్పటికే డార్లింగ్ ఆదిపురుష్ (Adhipurush) చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ మైథలాజికల్ ఫిల్మ్ వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రాధే శ్యామ్ తో కొంత నిరాశ పరిచిన ప్రభాస్ తన అప్ కమింగ్ ఫిల్మ్స్ తో థియేటర్లన్నీ దద్దరిల్లనున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు.