తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన సైరా చిత్రంలో చిరంజీవి అదరగొట్టారు. ఉయ్యాలవాడ పాత్రలో నటించి తన చిరకాల కోరికని నెరవేర్చుకున్నారు. భారీ బడ్జెట్ లో రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కిన సైరా చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో చిరంజీవి 152వ చిత్రం ప్రారంభమైంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. 

మెగాస్టార్, కొరటాల క్రేజీ కాంబోలో తెరకెక్కబోతున్న చిత్రం కావడంతో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయాన్ని తీసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. వారిలో త్రిష పేరు కూడా ప్రధానంగా వినిపించింది. 

తాజాగా ఏఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా ఖరారైనట్లు సమాచారం. త్రిషతో కొరటాల శివ చర్చలు ముగిశాయట. త్రిష ఈ చిత్రాన్ని అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కొన్ని ఫార్మాలిటీ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. 

త్రిష ఆల్రెడీ చిరంజీవితో కలసి నటించింది. స్టాలిన్ చిత్రంలో మెగాస్టార్ కు జోడిగా నటించింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత త్రిష చిరంజీవి సరసన నటించనుండడం ఆసక్తిగా మారింది. 

ఈ చిత్రంలో చిరు దేవాదాయ శాఖ అధికారిగా నటించనున్నారు. దేవాదాయ శాఖలో జరిగే అవినీతిపై కొరటాల శివ ఈ చిత్రంలో అస్త్రాలు సంధించబోతున్నట్లు తెలుస్తోంది. దేవుడి భూములని, ఆస్తులని రాజకీయం నాయకులూ మింగేస్తున్న విధానాన్ని కొరటాల శివ ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. 2020 సమ్మర్ లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.