కరోనా వైరస్ కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు కేరళలో 12 కరోనా పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. దీనితో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా నివారణ కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. 

కరోనా వైరస్ ప్రభావం ఎంటర్టైన్మెంట్ రంగంపై కూడా పడింది. ట్రేడ్ అనలిస్టులు అంచనా ప్రకారం ఇండియాలోని పలు ప్రాంతాల్లో కరోనా భయంతో సినిమా బిజినెస్ తగ్గిందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి కేరళలో ఎక్కువగా ఉంది. ఇప్పటికే కేరళలోని కొన్ని థియేటర్లు మూతబడుతున్నాయి. ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా థియేటర్స్ యజమాన్యాలని రిక్వస్ట్ చేశారు. 

మృత్యువు అంచు వరకు హీరోయిన్.. కారుపై బుల్లెట్ల వర్షం.. దేవుడే బతికించాడు!

కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని మార్చి 31 వరకు కేరళలో సినిమా థియేటర్స్ క్లోజ్ చేసి ఉంచాలని కోరారు. తద్వారా ప్రస్తుతం పరిస్థితుల్లో సమాజానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినట్లు అవుతుందని విజయన్ అన్నారు. ఇప్పటికే చాలా వరకు థియేటర్లని స్వచ్చందంగా యాజమాన్యాలు మూసివేశాయి. 

దీనితో కేరళలో పలు చిత్రాల విడుదల వాయిదా పడనుంది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మోహన్ లాల్ మరక్కార్ చిత్రం మార్చిలో విడుదల కావాల్సి ఉంది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ చిత్రాన్ని వాయిదా వేస్తున్నారు.