కరోనా దెబ్బకు ప్రపంచమంతా కకలావికలమవుతోన్న నేపధ్యంలో  సెలబ్రెటీలు ఎవరి స్దాయిలో వారు స్పందిస్తున్నారు.  సినిమావాళ్లు సైతం  కూడా ఈ కష్టకాలంలో తమవంతు సాయం చేయడానికి ముందుకొచ్చి ప్రజలకు,ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.కేవలం  విరాళాలు ఇచ్చి సరిపెట్టకుండా తమదైన శైలిలో పాటలు, వీడియోల రూపంలో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 

తాజాగా తన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో కలసి కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ ఓ షార్ట్ ఫిలిం తీశారు. కరోనా  మహమ్మారిని నివారించడానికి వైద్యులు, పోలీస్‌, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషిని వివరిస్తూ చేసిన షార్ట్‌ఫిలింకు మంచి రెస్పాన్స్  వస్తోంది. ఇందులో సాయికుమార్‌ పోలీసుగా.. ఆయకు కుమారుడు ఆది పారిశుద్ధ్య కార్మికుడిగా కనిపించగా.. కూతురు జ్యోతిర్మయి డాక్టర్‌గా కనిపించడం విశేషం. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ షార్ట్‌ పిలింను రూపొందించింది.సినీ కార్మికుల సంక్షేమ కోసం ప్రముఖ నటుడు సాయికుమార్‌  ₹5లక్షలు, డబ్బింగ్‌ యూనియన్‌కు ₹2 లక్షలు విరాళం ప్రకటించారు.