సౌత్ ఇండస్ట్రీని కరోనా వైరస్ మరొక్కసారి తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలు ముందుగానే గ్రహించి అన్ని సినిమాల నిర్మాతలు ప్లాన్ ప్రకారం ఏ విధంగా నష్టపోకుండా పనులన్నీ ఆపేశారు. అయితే కోలీవుడ్ మాత్రం ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడినట్లు టాక్ వస్తోంది.

కరోనా ఎక్కువరోజులు ఉండదులే అని మొదలుపెట్టిన పనులు సడన్ గా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అందులో సూర్య సినిమా ఒకటి. 'ఆకాశమే హద్దుగా నీ హద్దు రా' అనే సినిమాలో నటిస్తున్న సూర్య ఆ సినిమాని  మరికొన్ని రోజుల్లో భారీగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. రీసెంట్ గా అన్ని బిజినెస్ డీల్స్ ని క్లోజ్ చేసుకున్నారు. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఇప్పుడు కరోనా కారణంగా ఆ పనులకు కూడా బ్రేక్ పడింది.

దీంతో చిత్ర యూనిట్ సందిగ్ధంలో పడింది. పరిస్థితులను చూస్తుంటే ఇప్పట్లో కరోనా ఎఫెక్ట్ తగ్గేలా లేదు. మరికొన్ని రోజుల పాటు బాహ్య ప్రపంచంలో జనాలు తిరగడానికి ఛాన్స్ లేదు. దీంతో ఏప్రిల్ సెకండ్ వీక్ లో వస్తుంది అనుకున్న ఈ సినిమా సమ్మర్ నుంచి డ్రాప్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు సినిమాలు చాలా వరకు సమ్మర్ పోటీ నుంచి తప్పించుకున్నాయి. మరి సూర్య సినిమాకి ఎప్పుడు విముక్తి కలుగుతుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడింది. గురు దర్శకురాలు సుధా కొంగరా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.