ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎంతగా బయపెడుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చైనా నుంచి మొదలైన ఈ మహమ్మారి ఒక్కసారిగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ పై దెబ్బ కొడుతోంది. స్టాక్ మార్కెట్ నుంచి ప్రతి ఒక్క బిజినెస్ పై ఎంతో కొంత ప్రభావం చూపుతూనే ఉంది. ఇక సినిమాలపై కూడా గట్టి ప్రభావమే చూపుతోంది.

సినీ తారలు విదేశాల్లో చేయాల్సిన షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు.  హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమా 'నో టైమ్ టూ డై' ఏకంగా ఏడూ నెలల వరకు రిలీజ్ డేట్ ఉసెత్తకూడదనే విధంగా సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇక సల్మాన్ ఖాన్ కూడా కరోనా కు బయపడి వెనుకడుగు వేయక తప్పలేదు. నెక్స్ట్ రాధే సినిమా కోసం థాయిలాండ్ వేళ్ళాల్సిన సల్మాన్ వెంటనే షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. దీంతో ఆ సినిమా రిలీజ్ కూడా మరీంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

సినిమా షూటింగ్ ని వేగంగా పూర్తి చేస్తూ వస్తున్న సల్మాన్ కి థాయ్ ల్యాండ్ షెడ్యూల్ పూర్తవ్వకవడం కొంత సమయం వృధా అవ్వడమే అని చెప్పాలి. మిగతా హీరోలు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ పూర్తి చేస్తున్నప్పటికీ సల్మాన్ రిస్క్ తీసుకోవడం లేదు. థాయిల్యాండ్ లో కూడా కరోనా వైరస్ ఇప్పుడిపుడే వ్యాప్తి చెందుతుంది. ఇటీవల 50 మందికి అక్కడ కరోనా భారిన పడినట్లు తెలిసింది. మొత్తంగా ప్రపంచంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా 3,500మందికి పైగా వ్యాధి భారిన పడి ప్రాణాలు వదిలారు.