మొన్నటివరకు డ్రాగన్ కంట్రీని వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు దేశ విదేశాలకు మెల్లగా పాకుతోంది. తగ్గింది అనుకునే లోపే మళ్ళి కరోనా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బయటకు వెళ్లేందుకు జనాలు భయపడుతున్నారు. ఇక బాలీవుడ్ లో సైతం కరోనా ఎఫెక్ట్ గట్టిగ్గానే కనబడుతోంది. కారోనా కారణంగా షూటింగ్ లను సైతం క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలంటే జంకుతున్నారు. రీసెంట్ గ్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా తన పారిస్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంది. ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో తమ ప్రదర్శనకు హాజరు కావాలని లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్ దీపికను ఆహ్వానించింది. మార్చి 3 వరకు ఈవెంట్ నడుస్తుంది.అయితే కరోనా వైరస్ విదేశాలకు విస్తరిస్తోందన్న కారణంతో ఆమె కొన్ని రోజుల వరకు టూర్స్ ని క్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెక్స్ట్ దీపిక 83 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఆ సినిమాలో దీపిక.. కపిల్ సతీమణి రోమి దేవ్ గా కనిపించబోతోంది. ఇక కపిల్ దేవ్ గా దీపిక భర్త రణ్ వీర్ సింగ్ నటించిన విషయం తెలిసిందే.