చెన్నైలో టీవీ యాంకర్ ఇంట్లో కుక్కర్ పేలింది. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తపింది. టెలివిజన్ లో సూపర్ హిట్స్ అనే కార్యక్రమానికి యాంకరింగ్ చేసి ప్రసిద్ది గాంచిన మనిమేఘలై 2017లో నటన మాస్టర్ హుసైన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లి తరువాత ఒంటరిగానే నివసిస్తోంది. ఈ స్థితిలో మనిమేఘలై ఇంట్లో వంట చేసే వ్యక్తి రాకపోవడం వలన కుక్కర్ లో మనిమేఘలై వంట చేసింది. కుక్కర్ విజిల్ రాకుండా కొద్దిసేపటికే పేలిపోయింది.

చెల్లాచెదురు కావడంతో వంట గది నాశనమైంది. దీనిని మనిమేఘలై ఫోటో తీసి ఫోటో తీసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కుక్కర్ సమీపంలో ఎవరూ లేకపోవడం వలన ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.