రీసెంట్ వచ్చిన రవితేజ చిత్రాల్లో కామెడీ లేదనే కంప్లైంట్ ఉంది. ముఖ్యంగా రీసెంట్ గా  టైగర్ నాగేశ్వరరావు  చిత్రం డిజాస్టర్ నిలవటంతో రవితేజ ఎలర్ట్ అయ్యారని సమాచారం.


మొదటి నుంచి రవితేజ కామెడీని తన సినిమాల్లో ఇంక్లూడ్ చేస్తూ వస్తున్నారు. తనదైన స్పెషల్ స్లాంగ్ తో ఫన్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూంటారు. ఆయన ఫన్ చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యినవి ఎక్కువ. రీసెంట్ గా వచ్చిన ధమాకా సైతం కామెడీనే సేలబుల్ ఎలిమెంట్ గా మారింది. సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. అయితే రీసెంట్ వచ్చిన రవితేజ చిత్రాల్లో కామెడీ లేదనే కంప్లైంట్ ఉంది. ముఖ్యంగా రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు చిత్రం డిజాస్టర్ నిలవటంతో రవితేజ ఎలర్ట్ అయ్యారని సమాచారం. దాంతో తన తదుపరి చిత్రం ఈగిల్ లో కామెడీ డోస్ పెంచమని పురమాయించినట్లు సమాచారం. అంతేకాదు అనీల్ రావిపూడి, హరీష్ శంకర్ లతో కామెడీ యాక్షన్ సినిమాలు చేయటానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం.

ఇక వచ్చే (2024) సంక్రాంతి కు భాక్సాఫీస్ దగ్గర పోటీపడనున్న చిత్రాల్లో ‘ఈగల్‌’ (Eagle) ఒకటి. రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా ఇది. వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర టీమ్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, పలు కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడనుందని, జనవరి 26న విడుదలయ్యే అవకాశాలున్నాయని కొన్ని వెబ్‌సైట్లు వార్తలు వచ్చాయి. వీటిపై ‘ఈగల్‌’ టీమ్‌ స్పందించింది. అవన్నీ రూమర్స్‌ అంటూ వాటిని ఖండించింది.

 ముందుగా అనుకున్న తేదీకే సినిమా విడుదలవుతుందని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘ఈగల్‌’తోపాటు మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), వెంకటేశ్‌ ‘సైంధవ్‌’ (Saindhav), విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star), నాగార్జున ‘నా సామిరంగ’ (Naa Saami Ranga), తేజ సజ్జ ‘హనుమాన్‌’ (Hanuman) తదితర చిత్రాలు పోటీ పడనున్న సంగతి తెలిసిందే.

అలాగే యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ‘ఈగల్‌’లో రవితేజ పలు విభిన్న కోణాల్లో కనిపించనున్నారు. ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ నటిస్తున్నారు. నవదీప్‌, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని టి. జి. విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మరో ప్రక్క రవితేజ.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘డాన్‌శీను’, ‘బలుపు’, ‘క్రాక్‌’ వచ్చాయి.