టాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. సునీల్ ని వెంటనే గచ్చిబౌలిలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరీంత సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవల సునీల్ అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.  

గత వారం రోజులుగా సునీల్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు ఎక్కువగా  బయోటిక్స్ వాడినట్లు సమాచారం. అయితే దాని కారణంగా గొంతులో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కావడంతో రాత్రి సునీల్ ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు సునీల్ ని గచ్చిబౌలిలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. సునీల్ మాటలో కూడా కాస్త తేడా రావడం నీరసంగా ఉండడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది.

ప్రస్తుతం సునీల్ కి వైద్యులు చిక్కిత్స అందిస్తున్నారు. అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు. ఇక రేపు విడుదల కాబోయే డిస్కో రాజా సినిమాలో కూడా సునీల్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. అనారోగ్య కారణంగా ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతున్నట్లు సునీల్ ఇటీవల మీడియాకు తెలియజేశారు. ఇక మొత్తానికి సునీల్ ఆరోగ్య విషయంలో భయపడాల్సిన అవసరం లేదని అభిమానుల ముందుకు ఆయన త్వరలోనే వస్తారని సన్నిహితులు చెబుతున్నారు.