సాధారణంగా సినీ నటులు తమ కుమారులను వెండితెరకి పరిచయం చేస్తుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమ కూతుర్లను చిత్ర రంగంలోకి తీసుకోస్తుంటారు. మెగా కుటుంబానికి చెందిన నాగబాబు కుమార్తె నీహారిక హీరోయిన్ గా, అలాగే హీరో రాజశేఖర్ కూతుర్లు శివానీ, శివాత్మిక ఇలా ఇండస్ట్రీ నుండి చాలా తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే సినిమాల్లోకి వచ్చారు.

ఇప్పుడు ఈ కోవలోకి అలీ కుమార్తె బేబీ జువేరియా వచ్చి చేరింది. వి.బాల‌నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వి.నాగేశ్వ‌ర‌రావు,  సూర్య‌వంత‌రం, ఎం.ఎన్‌.యు.సుధాక‌ర్ నిర్మిస్తోన్న చిత్రం ‘మా గంగానది’. ‘అంత ప్ర‌విత్ర‌మైనది స్త్రీ’ అనేది ఉప‌శీర్షిక‌.

అలీ, నియా హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ సినిమాలో అలీ కూతురు బేబీ జువేరియాను మొట్టమొదటిసారిగా వెండితెరకి పరిచయం చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇటీవల విడుదల చేశారు.

భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలపై ఈ సినిమా తీస్తున్నట్లు నటుడు అలీ చెప్పారు. ఈ సినిమాలో తన కూతురు జువేరియా బాలనటిగా పరిచయమవుతుందని చెప్పారు.