Asianet News TeluguAsianet News Telugu

ఎవరినీ బెదిరించలేదు: సైరా సినిమా వివాదంపై వివరణ

వందేళ్లు దాటిన త‌ర్వాత‌ ఏ చ‌రిత్రకారుడికి సంబంధించిన సినిమానైనా ఎవరైనా తెర‌కెక్కించ‌వ‌చ్చునని, ఇందులో ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వని కొణిదేల ప్రొడక్షన్ ప్రతినిధులు అన్నారు. గ‌తంలో బ‌యోపిక్ తీసిన ఎవ‌రికీ ఈ విధమైన ఇబ్బంది ఎదురు కాలేదని వారు చెప్పారు.

Clarification on Sye Raa movie controversy
Author
Hyderabad, First Published Jun 30, 2019, 8:01 PM IST

హైదరాబాద్: సైరా సినిమా వివాదంపై కొణిదెల ప్రొడక్షన్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. తాము ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి 

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ సైరా సినిమా నిర్మ‌ిస్తున్నారు. చిత్రీక‌ర‌ణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త‌మ‌కు న్యాయం చేస్తామ‌ని చెప్పిన రామ్ చరణ్ మేనేజర్ ఇప్పుడు తమను బెదిరిస్తున్నాడని ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కుటుం స‌భ్యులు ఆదివారం కొణిదెల ప్రొడ‌క్ష‌న్ ఆఫీస్ ముందు ఆందోళ చేప‌ట్టారు. 

వందేళ్లు దాటిన త‌ర్వాత‌ ఏ చ‌రిత్రకారుడికి సంబంధించిన సినిమానైనా ఎవరైనా తెర‌కెక్కించ‌వ‌చ్చునని, ఇందులో ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వని కొణిదేల ప్రొడక్షన్ ప్రతినిధులు అన్నారు. గ‌తంలో బ‌యోపిక్ తీసిన ఎవ‌రికీ ఈ విధమైన ఇబ్బంది ఎదురు కాలేదని వారు చెప్పారు. సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రీక‌ర‌ణ‌కు ముందు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రావు కుటుంబ స‌భ్యుల‌తో తాము చ‌ర్చ‌లు జ‌రిపినట్లు వారు తెలిపారు. 

ఇప్పుడు కూడా వారితో తాము  చ‌ర్చ‌లు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.  ప్ర‌స్తుతం కోర్టులో కేసు న‌డుస్తున్నందున ఈ విష‌యంపై ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios