హైదరాబాద్: సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడిని హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. శ్యామ్ కె నాయుడు ప్రముఖ సినిమాటో గ్రాఫర్ ఛోటా కే నాయుడి తమ్ముడు. సినీ ఆర్టిస్ట్ సుధ ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్యామ్ కె నాయుడు తనను మోసం చేశారని సాయి సుధ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోకిరి, గంగతో రాంబాబు తదితర సినిమాలకు శ్యామ్ కె నాయుడు పని చేశారు. ఈ క్రమంలోనే సుధకు శ్యామ్ కె నాయుడితో పరిచయమైంది.

వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.