నేడు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలెబ్రేషన్స్ వైభవంగా జరుగుతున్నాయి. టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా అభిమానులకు క్రిస్మస్ విషెష్ తెలియజేశాడు. 'ఈ హాలిడే సీజన్ లో ప్రతి ఒక్కరు మధురమైన జ్ఞాపకాలు సొంతం చేసుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. ప్రతి ఒక్కరికి మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు' అని మహేష్ ట్వీట్ చేశాడు. 

ఇక క్రేజీ హీరోయిన్ సమంత ప్రత్యూష ఫౌండేషన్ లో పిల్లలతో కలసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది. ఆ దృశ్యాలని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎవరైతే జీవితాల్లో వెలుగు కోసం ఎదురు చూస్తున్నారో వారితో సెలెబ్రేట్ చేసుకున్నప్పుడే క్రిస్మస్ కు ఓ అర్థం ఉంటుంది' అని సమంత ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. 

ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అని కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది. 

ఇక హీరోయిన్ కేథరిన్ 'పిజ్జా' తింటూ క్రిస్మస్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My kinda holiday 😉 Merry Christmas everyone!! 😘😘

A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) on Dec 24, 2019 at 10:26pm PST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, హీరో రామ్ కూడా ట్విట్టర్ వేదికగా అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.