టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ దాదాపుగా నలభై ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. పదిహేను వందలకు పైగా పాటలకు కోరియోగ్రఫీ అందించారు. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోల సినిమాలకు సైతం పని చేశారు. ఈ మధ్యకాలంలో ఆయనకి సినిమా అవకాశాలు లేకపోవడంతో యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు.

శేఖర్ మాస్టర్, ఎన్టీఆర్, బాలకృష్ణ ఇలా చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులపై సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా మోహన్ బాబు ఫ్యామిలీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జనరేషన్ మారిందని, స్వేచ్చ పేరుతో అమ్మాయిలూ ఇష్టం వచ్చినట్లు పార్కుల చుట్టూ తిరుగుతున్నారని.. ఆడవాళ్లు మందు తాగే కల్చర్ హైదరాబాద్ లో కూడా వచ్చేసిందని.. జూబ్లీహిల్స్ లో అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని.. రేపు వీళ్లకు పుట్టే పిల్లలు కూడా తాగుతారని.. అదే మోడర్న్ కల్చర్ అని అన్నారు.

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి.. హాట్ క్లీవేజ్ షోతో రచ్చ!

ఓ పెద్ద హీరో కూతురు, పెద్ద ప్రొడ్యూసర్ కూతురు మందు తాగుతూ తన ముందు నిల్చున్నారని.. అక్కడే చిరంజీవి గారు కుర్చీ వేసుకొని కూర్చున్నారని.. 'జై చిరంజీవ' షూటింగ్ జరుగుతుందని గుర్తు చేసుకున్నారు.

ఆ పెద్ద హీరో కూతురు, ప్రొడ్యూసర్ కూతురు పేర్లు చెప్పడానికి తనకు భయం లేదని.. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి, అశ్వనీదత్ కూతురు ఇద్దరూ చేతులో బీర్లు పట్టుకొని తాగుతూ ఉన్నారని చెప్పాడు. తాగేసి మంచు లక్ష్మి.. అశ్వనీదత్ కూతురుతో కలిసి ఏం చేసిందో నేను కళ్లారా చూశా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా చెప్పినందుకు మోహన్ బాబు తనకు వార్నింగ్ ఇచ్చినా.. భయపడనని రాకేశ్ మాస్టర్ చెప్పుకొచ్చారు.