హీరో విక్రమ్.. సినీ అభిమానులకు ఇది పరిచయం అవసరం లేని పేరు. తన విలక్షణ నటనతో దశాబ్దాల కాలంగా విక్రమ్ అభిమానులని అలరిస్తున్నాడు. తన పాత్ర కోసం విక్రమ్ ఎంతటి సాహసమైనా, రిస్క్ అయినా చేసేందుకు వెనుకాడడు. నటనకు విక్రమ్ రిస్క్ చేయడం ఇదేం కొత్త కాదు. 

ప్రస్తుతం విక్రమ్ కోబ్రా అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ అజయ్ ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అజయ్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ఒక సన్నివేశం కోసం విక్రమ్ తన ప్రాణాలనే రిస్క్ లో పెట్టాడని అజయ్ అన్నారు. 

ఓ సన్నివేశంలో హీరో చేతుల, కాళ్ళు కట్టేసి ఉంటాయి. నోటికి కూడా గుడ్డ కట్టి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కాళ్ళని పైన కట్టేసి ఉండగా తల్లకిందులుగా నీటిలో ముంచుతారు. అలా కొంత సమయం నీటిలోనే ఉండాలి. ముందుగా ఈ సన్నివేశాన్ని డూప్ తో చేయించాలని ప్లాన్ చేసుకున్నాం. 

కానీ డూప్ కొన్ని సెకండ్ల కంటే ఎక్కువ సమయం భరించలేకపోయాడు. షూట్ చేసిన వరకు చాలని, ఎడిటింగ్ లో మేనేజ్ చేద్దాం అని అనుకున్నాం. కానీ సీన్ పై విక్రమ్ సంతృప్తిగా లేడు. డూప్ అవసరం లేకుండా తానే చేయడానికి ముందుకు వచ్చాడు. శ్వాస తీసుకోవడం కష్టం అయినా సరే షాట్ ని పర్ఫెక్ట్ గా పూర్తి చేశాడు. 

టాప్ లెస్ గా జల్సా హీరోయిన్ చెల్లి.. బికినీలో అక్కాచెల్లెళ్ల అందాలు వైరల్

ఆ మరుసటి రోజు నాకు తెలిసింది. నీటిలో తలకిందులుగా మునగడం వల్ల.. విక్రమ్ తలలోకి నీరు వెళ్లిందట.. నరాలకు ఇబ్బంది కలగడంతో విక్రమ్ చికిత్స చేయించుకున్నారు. అయినా కూడా మరుసటి రోజు షూటింగ్ లో పాల్గొన్నారు అని అజయ్ తెలిపారు. 

గతంలో కాశి చిత్రంలో కూడా విక్రమ్ గుడ్డివాడిగా నటించాడు. అలా నటించడం వల్ల విక్రమ్ కంటి నరాలు దెబ్బతినడం, చికిత్స చేయించుకోవడం జరిగింది. శంకర్ ఐ చిత్రంలో కూడా అనూహ్యంగా బరువు తగ్గిన సంగతి తెలిసిందే.