ఓ పెద్ద సినిమా వస్తోందంటే అభిమానుల హంగామా ఓ రేంజిలో ఉంటుంది. సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంభందించిన అప్ డేట్స్ తో కొందరు పండుగ చేసుకుంటారు. మరి కొంత మంది ఓ అడుగు ముందుకేసి ఆ సినిమా ఎలా ఉండాలో..ఉంటుందో ఊహించి పోస్టర్స్, ట్రైలర్స్ వదులుతూంటారు. అయితే అవి ఒక్కోసారి ఒరిజనల్ గా ప్రొడక్షన్ కంపెనీవారు విడుదల చేసినవి అనిపిస్తూంటాయి. ఇప్పుడు చిరంజీవి 152 సినిమాకు కూడా అలాంటిదే జరిగింది.

నిన్నంతా సోషల్ మీడియాలో  చిరంజీవి కొత్త చిత్రానికి సంభందించి ఓ పోస్టర్ హల్ చల్ చేసింది.  చిరు, కొరటాల మూవీ టైటిల్ ఇదేనంటూ ఒక పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. గోవిందం ఆచార్య అనే టైటిల్ తో ప్రచారం అయిన ఆ పోస్టర్ లో చిరంజీవి కమ్యూనిస్ట్ లా కనపడుతూ..చేతిలో ఓ గన్ పట్టుకొని ఉండగా, వెనుక జండాలు పట్టుకున్న ఎర్ర దండు ఉంది. అయితే ఇది ఒరిజినల్ కాదు. ఓ అభిమాని చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ కావటం చెప్పుకోదగ్గ అంశం. నిజమా అన్నట్లుగా...అతి సహజంగా ఉన్న ఆ టైటిల్ పోస్టర్ అందరినీ బోల్తా కొట్టించింది.

ఈ విషయం గమనించిన కొణిదెల ప్రొడక్షన్స్  వెంటనే స్పందించారు. మేము ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నింర్ణయించలేదని, టైటిల్ పెట్టిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తాం అని ట్విట్టర్ పోస్ట్ చేశారు. దీనితో ప్రచారం అవుతున్న ఆ టైటిల్ పోస్టర్ లో ఏమాత్రం నిజం లేదని తేలింది.

సైరా సక్సెస్  తరువాత చిరంజీవి దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న సినిమా ఇది. చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ  రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. మహేష్ బాబు తో భరత్ అనే మూవీ చేసిన కొరటాల ఈ మూవీ కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నారు.

సోషల్ ఎవేర్ నెస్ కలిగిన  స్టోరీ లైన్  తీసుకొని, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి స్టార్ హీరోలతో  చేస్తూంటారు  కొరటాల. అదే పద్దతిలో  చిరు కోసం కూడా ఓ సోషల్ ఎలిమెంట్ తో కూడిన పవర్ ఫుల్ స్టోరీ సిద్ధం చేశారని వినపడుతోంది. త్వరలో సెట్స్ పైకెళ్ళనున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా నిర్ణయం కాలేదు.