తెలుగు సినిమాల్లో బ్రహ్మాజీది ఓ ప్రత్యేకమైన స్దానం. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ వస్తున్న ఆయనకు వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది. అందరు హీరోలు పర్శనల్ గా ఆయన్ని అభిమానిస్తారు. వరస సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు తన కుమారుడుని సైతం లాంచ్ చేస్తున్నారు. బ్రహ్మాజీ కుమారుడు హీరోగా ‘ఓ పిట్టకథ’ అనే చిత్రం రూపొందుతోంది.

త్వరలో రిలీజ్ అయ్యే ఈ సినిమా ప్రమోషన్ కోసం తన పరిచయాలను వాడుతున్నాడు. త్రివిక్రమ్ తో ఫస్ట్ లుక్ పోస్టర్, మహేష్ బాబుతో ఫిల్మ్ టీజర్ లాంచ్ చేసారు. ఇప్పుడు ఆఖరి అస్త్రం వదిలారు. మెగాస్టార్ చిరంజీవిని ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. మార్చి 1 హైదరాబాద్ లో జరిగే ఈ ఈవెంట్ తో సినిమా కు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.
 
ఇక భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న భవ్య క్రియేషన్స్‌ సంస్థ తొలిసారిగా కొత్త తారలతో.. కొత్త దర్శకుడితో నిర్మించిన సరికొత్త కంటెంట్‌ ఫిల్మ్‌.. ‘ఓ పిట్టకథ’. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా, బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 6న రిలీజ్‌ కానుంది.

చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌‌గా ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ : ‘‘కథను నమ్మి తీసిన సినిమా ఇది. ఇప్పటికే మా ప్రచార చిత్రాలకు మంచి రెస్సాన్స్‌ లభిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయనున్నాం. చిరంజీవి గారి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్‌కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్‌’’ అన్నారు.