Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్: అప్పట్లో పవన్ తో ఆగిందే... ఇప్పుడు చిరుతో!

తమిళంలో వచ్చి హిట్టైన వేదాళం రీమేక్ ని చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. తల అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం అప్పట్లో పెద్ద హిట్. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తొలి వారంలోనే రూ.45కోట్లకు పైగా వసూలు చేసి సౌత్ సినిమా స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. లాంగ్రన్లో వంద కోట్లు వసూలు చేసిన 'వేదలం' సినిమాపై టాలీవుడ్ హీరోల కన్నుపడింది. మొదట ఆ సినిమాని పవన్ తో చేద్దామనుకున్నారు. 

Chiranjeevi wants to remake Vedalam with Meher Ramesh
Author
Hyderabad, First Published May 6, 2020, 1:18 PM IST

మెగాస్టార్ చిరంజీవి కేవలం నటన విషయంలోనే కాదు ప్రొడక్షన్, సినిమా నిర్మాణం, స్క్రిప్టుల ఎంపిక వంటి విషయాల్లో అపారమైన అనుభవం ఉంది. ఆ అనుభవం ఆయన సక్సెస్ రేటుని పెంచేలా చేసింది. ఇప్పటికీ ఆయన యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారంటే అదే కారణం. స్క్రిప్టు దశలోనే ఆయన ప్రాజెక్టు ని పూర్తి గా అంచనా వేసేస్తారు. అలాగే ఏ దర్శకుడుతో ఎలాంటి సబ్జెక్టు చేస్తే వర్కవుట్ అవుతుందో పూర్తిస్దాయిలో లెక్కలేసి మరీ దిగుతారు.

 అలాగే ఇప్పుడు కూడా ఆయన తమిళంలో వచ్చి హిట్టైన వేదాళం రీమేక్ ని చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. తల అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం అప్పట్లో పెద్ద హిట్. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తొలి వారంలోనే రూ.45కోట్లకు పైగా వసూలు చేసి సౌత్ సినిమా స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. లాంగ్రన్లో వంద కోట్లు వసూలు చేసిన 'వేదలం' సినిమాపై టాలీవుడ్ హీరోల కన్నుపడింది. మొదట ఆ సినిమాని పవన్ తో చేద్దామనుకున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎస్.ఐశ్వర్య నిర్మించనున్న ఈ చిత్రానికి ఆర్.టి.నేసన్ దర్శకుడుగా ఎంపిక చేసారు. విజయదశమి సందర్భంగా సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. అయితే రకరకాల కారణాలతో వర్కవుట్ కాలేదు.  

అయితే ఇప్పుడు అదే సబ్జెక్టుని మెగాస్టార్ చేద్దామని ఆలోచిస్తున్నారట. అందులో భాగంగా స్క్రిప్టుని  మెహర్ రమేష్ తో రెడీ చేయిస్టున్నట్లు చెప్తున్నారు. చిరు ఇమేజ్‌కి తగ్గట్టు ‘వేదాళం’ కథలో మార్పులు చేస్తున్నారట దర్శకుడు మెహర్ రమేష్. సరైన కథ ఉంటే బిల్లా వంటి హిట్ ఇస్తారని మెహర్ రమేష్ ని చిరంజీవి నమ్మి ఈ ప్రాజెక్టు అప్ప చెప్పబోతున్నారట. రీమేక్ కాబట్టి తను అనుకున్నట్లు గా స్క్రిప్టు వస్తే ఖచ్చితంగా పట్టాలు ఎక్కిస్తానని హామీ ఇచ్చారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఇప్పుడు పని అంతా మెహర్ రమేష్ చేతిలో ఉంది. ఆయన ఎంత బాగా స్క్రిప్టు రాస్తారా అనే దాన్ని బట్టి మిగతా విషయాలు ఆధారపడి ఉంటాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios