Asianet News TeluguAsianet News Telugu

'వాల్తేరు వీరయ్య' లెక్కలు, బిజినెస్...బ్రేక్ ఈవెన్ (ఏరియావైజ్)

  చిరంజీవి సరసన  హీరోయిన్ గా శ్రుతిహాసన్ అలరించగా, ఐటమ్ సాంగులో ఊర్వశి రౌతేలా కనువిందు చేసింది. ప్రకాశ్ రాజ్ .. బాబీ సింహా ప్రతినాయకులుగా కనిపించారు.  

Chiranjeevi #WaltairVeerayya Business and breakeven areas as of now
Author
First Published Jan 19, 2023, 12:28 PM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. తొలిరోజునే భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలెట్టింది.  ప్రపంచవ్యాప్తంగా తొలి 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.  5 రోజుల థియేటర్ లో వచ్చిన మొత్తం గ్రాస్  - 109.70cr తో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 

ఈ చిత్రం పండగ రోజుల్లో అన్ని చోట్లా ఒకేలా ఫెరఫార్మ్ చేసింది. అయితే పండగ పూర్తయ్యాక...ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఇప్పటికి కలెక్షన్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. పండగ రోజుల మాదిరిగానే హౌస్ ఫుల్ బోర్డ్ లు కనపడుతున్నాయి. రిపీట్ ఆడియన్స్ ప్లస్ అవుతున్నారు. ఇక నైజాం లో మాత్రం డ్రాప్ కనపడింది. అయితే అక్కడ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ వచ్చేసింది. ఈ నేపధ్యంలో ఏయే ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. అక్కడ ఎంత బిజినెస్ అయ్యిందో లెక్కలు చూద్దాం. 


👉నైజాం: 18 - 24.47✅
👉సీడెడ్ : 15 - 14.21
👉ఉత్తరాంధ్ర: 10.2 -10.19✅
👉ఈస్ట్ గోదావరి : 6.50 -  7.55✅
👉వెస్ట్ గోదావరి: 6 - 4.25
👉గుంటూరు: 7.50 -5.95
👉కృష్ణా : 5.6 -5.58
👉నెల్లూరు : 3.2 -2.81

ఈ సినిమాకు చిరంజీవితో పాటు రవితేజ కూడా తోడవడంతో, సెకండాఫ్ నుంచి ఎమోషన్ ను కూడా తోడుచేసుకుని నడుస్తుంది. ఇక దేవిశ్రీ పాటలు ఈ సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చాయి.   చిరంజీవి సరసన  హీరోయిన్ గా శ్రుతిహాసన్ అలరించగా, ఐటమ్ సాంగులో ఊర్వశి రౌతేలా కనువిందు చేసింది. ప్రకాశ్ రాజ్ .. బాబీ సింహా ప్రతినాయకులుగా కనిపించారు. ప్రస్తుతం వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తున్న ఈ సినిమా, లాంగ్ రన్ లో ఎంతవరకూ రాబడుతుందనేది చూడాలి. 
 
తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా థియేటర్ల కౌంట్ పెంచాల్సి రావడం, బిసి కేంద్రాల్లో ఆడియన్స్ డిమాండ్ మేరకు అదనపు షోలను ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ వీరయ్య వీరంగానికి సూచికగానే చెప్పుకోవాలి. పండగ సీజన్ కావడంతో సాధారణంగా ఉండే జోరు కన్నా రెండుమూడింతలు ఎక్కువగానే కనిపిస్తోంది.వీరసింహారెడ్డికి సైతం మంచి ఫిగర్లు నమోదవుతున్నా చిరు డామినేషన్ తో పోలిస్తే అవి తక్కువ కావడంతో హైలైట్ కావడం లేదు.   
 

Follow Us:
Download App:
  • android
  • ios