Asianet News TeluguAsianet News Telugu

కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టు కు బ్రేక్ , ఆ మెగా డైరక్టర్ కు గ్రీన్ సిగ్నల్?

ఇవాళో రేపో కళ్యాణ్ కృష్ణ  ప్రాజెక్టుకి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్న టైమ్ లో ఓ ట్విస్ట్ పడిందన్నారు.   
 

Chiranjeevi Vinayak film to take off? what about Kalyan Krishna jsp
Author
First Published Sep 11, 2023, 6:53 AM IST

గత కొద్ది నెలలుగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ  సినిమా చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి.చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela) హోం బ్యానర్‌ గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసారు.   అంతేకాదు చిరంజీవి, త్రిష కాంబినేషన్‌ మరోసారి రిపీట్ కానుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది కళ్యాణ్ కృష్ణ సినిమా తండ్రీకొడుకుల స్టోరీతో రాబోతుండగా.. చిరంజీవి తండ్రి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.ఇవాళో రేపో ఈ ప్రాజెక్టుకి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్న టైమ్ లో ఓ ట్విస్ట్ పడిందన్నారు.   

మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన  భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి ఆలోచనలో పడి నిర్ణయం మార్చుకున్నాడని సమాచారం. బెజవాడ ప్రసన్నకుమార్ అందించిన  కథ లైటర్ వీన్ లో ఉందని వద్దనుకున్నట్లు తెలుస్తోంది. మరి అయితే ఏ డైరక్టర్ తో చేయబోతున్నారు అంటే వివి వినాయిక్ అని వినికిడి. అందుతున్న సమాచారం మేరకు నాలుగు రోజుల క్రితమే వివి వినాయిక్ తో ఫైనల్ మీటింగ్ జరిగి చిరంజీవి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబోపై ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉందంటున్నారు.  

అంటే కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టు ప్లేస్ లో వినాయిక్ సినిమా పట్టాలెక్కే అవకాసం ఉంది. అది లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ అని, మెసేజ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని వినికిడి. తన ఫ్యాన్స్ కు పండగ చేసే ఎలిమెంట్స్ తో వినాయిక్ తరహా ఫన్ ని మిక్స్ చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తారు. అయితే కళ్యాణ్ కృష్ణ తో సినిమాని పూర్తిగా ప్రక్కన పెడతారా లేక వేరే కథతో ముందుకు వెళ్తారా..లేక గ్యాప్ ఇచ్చి చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. 

మాస్ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ అయిన వివి వినాయక్ గత కొంతకాలంగా పరాజయాలను ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన సరైన కథతో వస్తే మళ్లీ బ్లాక్ బస్టర్ ఇస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ నేఫధ్యంలో ఆయన దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో వారందరికీ ఇది ఒక సర్ ప్రైజింగ్ వార్తే.   2018లో వచ్చిన ‘ఇంటెలిజెంట్‌’ సినిమాకు వినాయక్‌ చివరగా దర్శకత్వం వహించారు. సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ అయ్యింది. 

 చిరంజీవి (Chiranjeevi) బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడని తెలిసిందే. MEGA 157కు సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ ఇప్పటికే నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. సోషియా ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది చిరంజీవి టీం. మెగా సినిమాకు మెగా ఆరంభం. మెగా 157 ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయి.

మీ అందరికీ సినిమాటిక్ అడ్వెంచర్‌ను అందించడానికి మేమంతా సిద్దం అంటూ చిరంజీవి అండ్‌ టీంతో దిగిన ఫొటోను షేర్ చేశాడు డైరెక్టర్ వశిష్ఠ. ఇప్పుడీ లుక్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని లీడింగ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి చోటా కే నాయుడు డైరెక్టర్ ఆఫ్‌ ఫొటోగ్రఫీ. వంశీ, ప్రమోద్ విక్రమ్‌ తెరకెక్కిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios