2020లో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. RRR వాయిదాతో నీరాశపరిచినప్పటికీ మిగతా స్టార్ హీరోలు సాలిడ్ గా సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ 152వ ప్రాజెక్ట్ తో పాటు ప్రభాస్ 20,21 పవన్ కళ్యాణ్ 26వ సినిమాలు ఇదే ఏడాది రాబోతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాల టైటిల్స్ పై ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు.

అఫీషియల్ గా ఎనౌన్స్  చేయనప్పటికీ సినిమాల టైటిల్స్ ని ముందే ఫిల్మ్ ఛాంబర్ ఓ రిజిస్ట్రేషన్ చేశారు. ముందుగా పవన్ కళ్యాణ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్ 26వ సినిమాకు మొన్నటి వరకు లాయర్ సాబ్ అనే టైటిల్ అనుకున్నారు. ఇక ఇప్పుడు 'వకీల్ సాబ్' టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ 20,21 ప్రాజెక్ట్స్ కి యూవీ క్రియేషన్స్ కూడా రెండు టైటిల్లను రిజిస్ట్రేట్ చేసింది. ప్రభాస్ 20 రాధాకృష్ణ డైరెక్షన్ లో రానుంది.

ఇక 21వ సినిమా కొరటాల శివతో చేయబోతున్నాడట. 20వ సినిమాకు మొన్నటి వరకు జాన్ అనే టైటిల్ అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. జాను సినిమా ఎఫెక్ట్ తో టైటిల్ ని మార్చేశారు. ఇక ఇప్పుడు 'ఓ డియర్' ఫిక్స్ చేయనున్నారు. కొరటాల సినిమాకు  'రాధే శ్యామ్'  అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసి ఉంచారు. ఇక మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకు ముందు గోవింద ఆచార్య అనే టైటిల్ అనుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక నుంచి 'ఆచార్య' అనే టైటిల్ ని అనుకుంటున్నారట. ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయని ఈ రిజిస్ట్రేషన్ టైటిల్స్ ఎంతవరకు సెట్టవుతాయో చూడాలి. మనసు మారితే మధ్యలో మార్చే  అవకాశం ఉంటుంది.