మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా. అక్టోబర్ లో విడుదలైన సైరా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు అద్భుతంగా నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల దర్శత్వంలో తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. 

కొన్ని రోజుల క్రితం చిరంజీవి నివాసంలో 80 దశకంలోని హీరో, హీరోయిన్ల రీయూనియన్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. దక్షణాది చిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 40 మంది హీరో, హీరోయిన్లు ఈ పార్టీలో పాల్గొన్నారు. సెలెబ్రిటీలంతా బ్లాక్ అండ్ సిల్వర్ డ్రెస్సుల్లో మెరిసిన ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా తాజాగా సెలెబ్రిటీలంతా పార్టీలో రచ్చ చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి అలనాటి తారలతో స్టెప్పులేస్తున్న దృశ్యాలు ఫ్యాన్స్ ని తెగ అలరిస్తున్నాయి. 

చిరంజీవి, ఖుష్బూ కలసి బంగారు కోడిపెట్ట సాంగ్ కు రెచ్చిపోయి డాన్స్ చేశారు. చిరంజీవితో పాటు జయప్రద కూడా డాన్స్ చేసింది. ఈ వీడియోలో నాగార్జున, రాధికా ఇతర సెలబ్రిటీలంతా ఫుల్ హ్యాంగ్ ఓవర్ లో కనిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరిగిన రీయూనియన్ పార్టీకి రాధికా, సుహాసిని, జయసుధ, నాగార్జున, వెంకటేష్, నరేష్, భాను చందర్ లాంటి 80 దశకం నటులంతా పాల్గొన్నారు.