సైరా చిత్రానికి రాంచరణ్ నిర్మాత. ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. తెలుగు రాష్ట్రాల్లో సైరా చిత్రం సూపర్ సక్సెస్ దిశగా సాగుతుండడంతో చిత్ర యూనిట్ పార్టీ మూడ్ లో ఉంది. ఇటీవల ఇండియా సినిమాలో బయోపిక్ చిత్రాల హవా సాగుతోంది. 

ప్రముఖులు జీవితాలని దర్శక నిర్మాతలు వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి బయోపిక్ గురించి కూడా చర్చ మొదలైంది. మెగాస్టార్ బయోపిక్ లో ఎవరు నటిస్తే బావుంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తన బయోపిక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

నా బయోపిక్ లో లో రాంచరణ్ నటించకూడదని చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాంచరణ్ నా పాత్రలో వంద శాతం న్యాయం చేస్తాడు. అందులో సందేహం లేదు. కానీ నా పోలికలు ఎక్కువగా సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ లకు వచ్చాయని చాలా మంది చెబుతుంటారు. అందువల్ల వారిలో ఎవరైనా ఒకరు నటించాలని చిరంజీవి పేర్కొన్నారు.