చిరు మరో పోస్ట్ చేశారు. ఇందులో 'లాల్ సింగ్ చద్దా' సినిమాను తెలుగులో సమర్పిస్తున్నట్టుగా పేర్కొన్నారు. అలాగే, 'ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తున్నందుకు చాలా ఆనందంగా భావిస్తున్నాను..డెఫినెట్ గా ఈ సినిమా ఎమోషనల్ రైడ్.. మా తెలుగు ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. వారు కూడా ఈ సినిమాని ఆదరిస్తారు'.. అని మెగాస్టార్ తెలిపారు.
ఆమిర్ ఖాన్(Aamir Khan) నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha). అమెరికన్ ఫిలిం ‘ఫారెస్ట్ గంప్’ (Forrest Gump)కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. కరీనా కపూర్ (Kareena Kapoor) హీరోయిన్‌గా నటించింది. ఆమిర్ ఈ చిత్రంలో లాల్ సింగ్ చద్దాగా నటించాడు. బుబ్లా అనే పాత్రలో నాగ చైతన్య కనిపించనున్నాడు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. వయాకాం 18 స్టూడియోస్‌తో కలసి తన సొంత నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులోనూ భారీగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ తెలుగు చలన చిత్ర ప్రముఖుల కోసం పత్యేక ప్రివ్యూను హైదరాబాద్‌లో నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో తాజాగా ఈ ప్రివ్యూను ప్రదర్శించారు. అంతేకాదు ఈ చిత్రాన్ని చిరంజీవి సమర్పిస్తున్నారు. దాంతో తెలుగులో ఈ సినిమాకు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా చిరు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. 'లాల్ సింగ్ చద్దా ఆమిర్ డ్రీమ్ ప్రాజెక్ట్.. తన కల నెవేర్చుకోవడమే కాకుండా..దీనిలో నాకూ భాగం కలించారు'.. అని ట్వీట్‌లో రాసుకోచ్చారు. అలాగే, తాజాగా చిరు మరో పోస్ట్ చేశారు. ఇందులో ఆయన 'లాల్ సింగ్ చద్దా' సినిమాను తెలుగులో సమర్పిస్తున్నట్టుగా పేర్కొన్నారు. అలాగే, 'ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తున్నందుకు చాలా ఆనందంగా భావిస్తున్నాను..డెఫినెట్ గా ఈ సినిమా ఎమోషనల్ రైడ్.. మా తెలుగు ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. వారు కూడా ఈ సినిమాని ఆదరిస్తారు'.. అని మెగాస్టార్ తెలిపారు.
లాల్ సింగ్ చద్దాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. ఆమిర్ నాలుగేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో, లేదో తెలియాలంటే విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
