కరోనా కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న నేపథ్యంలో ప్రముఖులు తమ వంతు సాయం అంధించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు (శనివారం) ఉదయం నుంచి మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి మాస్క్‌లు కుట్టి పంచుతున్నారన్న వార్త గట్టిగా ప్రచారం జరిగింది. ఈ వార్త దిన పత్రికల్లో కూడా రావటంతో చిరంజీవి దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ వార్తలపై స్పందించారు.

మీడియాలో ప్రచారం అవుతున్నవార్తలు నిజం కాదంటూ, తన తల్లి అంజనా దేవి మాస్క్‌ లు కుడుతున్నట్టుగా ప్రచారం అవుతున్న ఫోటో నిజంగా కాదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. `మీడియా, వార్త సాధనాల్లో మా అమ్మ కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆమె అమ్మ కాదని తెలియ జేస్తున్నాను. అయితే ఎవరైన సరూ ఇంత గొప్ప పని చేస్తూ ఆ తల్లికి నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. కమ్మనైన మనసున్న ప్రతీ తల్లి అమ్మే` అంటూ క్లారిటీ ఇచ్చారు.

కరోనా పై పోరాటంలో మెగా కుటుంబం తన వంతు సాయం అందిస్తూనే ఉంది. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్ తో పాటు చిరంజీవి, రామ్‌ చరణ్‌, సాయి ధరమ్ తేజ్‌, వరణ్‌ తేజ్‌లు తమ వంతుగా రాష్ట్ర ప్రభుత్వాలకు, సినీ ఇండస్ట్రీ కార్మికులకు సంబంధించిన కరోనా క్రైసిస్ చారిటీలకు భారీగా విరాళాలు ప్రకటించారు.