మెగాస్టార్ చిరంజీవి పక్కన సరైన హీరోయిన్ దొరకడం కష్టంగా మారింది. 'స్టాలిన్' సినిమా సమయంలో త్రిషతో కలిసి నటించిన సమయంలోనే చాలా విమర్శలు వినిపించాయి. ఇప్పుడు రీఎంట్రీ లో కూడా తనకంటే వయసులో చాలా చిన్నవాళ్లైన హీరోయిన్లతో కలిసి నటిస్తున్నారు. ఆ హీరోయిన్లతో రొమాంటిక్ సీన్స్ వచ్చేసరికి.. చిరు కాస్త ఇబ్బందిగా నటిస్తున్నాడు.

అటువంటి సన్నివేశాలు తెరపై చూడడం కూడా ఎబ్బెట్టుగా ఉండనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన 'సైరా నరసిమాహ్రెడ్డి' సినిమాలో చిరు పక్కన నయనతార బాగానే సెట్ అయింది కానీ తమన్నా మాత్రం సూట్ అవ్వలేదు. తెరపై చిరు, తమన్నా కాంబినేషన్ సీన్స్ చూడడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. చిరంజీవి అటువంటి సన్నివేశాలు చేయకపోతేనే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే చిరంజీవి సినిమా అంటే మాస్ మసాలా ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. 

అందులో పాటలు లేకపోతే ఆడియన్స్ నిరాస చెందడం ఖాయం. 'సైరా' సినిమాలో అటువంటివి లేకపోయినా కాన్సెప్ట్ కి తగ్గట్లుగా సినిమా ఉండడంతో సక్సెస్ అయింది. అయితే తన తదుపరి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా చూసుకుంటానని చిరు అన్నారు. అయితే ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ లో చిరు కనిపించకుండా ఉండడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నట్లు తెలుస్తోంది.

కొరటాల తెరకెక్కిస్తున్న సినిమాలో రామ్ చరణ్ ని యంగ్ చిరంజీవిగా చూపించే ఏర్పాట్లు జరుగుతున్నాయట. రోమాన్స్, డాన్స్ ల కోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ని చూపించి తదుపరి సినిమా చిరంజీవితో కానిచ్చేస్తారని సమాచారం. కానీ అన్ని సినిమాలకు ఈ స్ట్రాటజీ వర్కవుట్ అవ్వదు.