విక్టరీ వెంకటేష్‌, నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రం 'వెంకీమామ'. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. ఆడియన్స్ తో పాటు కొందరు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు సినిమా బావుందంటూ ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ లిస్ట్ లోకి చేరారు. ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా వీక్షించారు.

షో అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “మా ఫ్యామిలీ అంతా క‌లిసి `వెంకీమామ‌` సినిమా చూశాం. అంద‌రికీ బాగా న‌చ్చింది. అంద‌రూ ఎంజాయ్ చేశాం. సినిమా అంత బాగా న‌చ్చ‌డానికి కార‌ణం మిత్రుడు వెంక‌టేశ్‌. త‌న స్టైల్ ఆఫ్ కామెడీ, ఎమోష‌న్స్‌తో అందరినీ మెప్పిస్తున్నారు. చాలా కాలం త‌ర్వాత యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ వావ్ అనిపించాడు. అద్భుతంగా న‌టించి ఈ స‌క్సెస్‌కు ప్ర‌ధాన కార‌ణంగా నిలిచాడు. త‌న‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాను'' అన్నారు. 

2019 ఫోర్బ్స్ లిస్ట్: టాప్ 100లిస్ట్ లో టాలీవుడ్ స్టార్స్

అలాగే మామ‌కు త‌గ్గ అల్లుడిగా నాగ‌చైత‌న్య మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ చేశాడని.. ఈ స‌క్సెస్‌లో త‌ను కూడా భాగ‌స్వామిగా మారాడని అన్నారు. డైరెక్ట‌ర్ బాబీ త‌న స్టైల్ ఆఫ్ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో ప‌ట్టు స‌డ‌ల‌కుండా బ్యూటీఫుల్‌గా సినిమాను తెర‌కెక్కించి శ‌భాష్ అనిపించాడని.. ఈ సినిమాలో స‌క్సెస్ అయిన సంద‌ర్భంలో చిత్ర‌యూనిట్‌కు నా అభినంద‌న‌లు అంటూ చెప్పుకొచ్చారు. 

సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో వెంకటేష్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నాగ చైతన్య సరసన రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటించారు.