'సైరా నరసింహారెడ్డి' సినిమాతో సక్సెస్ అందుకున్న చిరంజీవి తన అభిమానులకు దసరా కానుకగా మరో సినిమా మొదలుపెట్టారు. చాలా కాలంగా తన 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు చెప్పుకొచ్చిన చిరు ఇప్పుడు ఆ సినిమాను మొదలుపెట్టాడు.

నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దసరా సందర్భంగా సినిమా పూజాకార్యక్రమాలు మంగళవారం నాడు నిర్వహించారు. చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివలతో పాటు చిరు తల్లి అంజనా దేవి,  సురేఖా, సుష్మితలు ఈ వేడుకకు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సురేఖా క్లాప్ కొట్టారు.

త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. చిరు అభిమానులను మెప్పించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం. అంతేకాదు.. ఈ సినిమా ద్వారా చక్కటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు.

ఈ సినిమాలో ఇలియానాని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. 'సైరా' మాదిరి ఈ సినిమాను కూడా ఇతర భాషల్లో విడుదల చేస్తారా..? లేక తెలుగుకే పరిమితం చేస్తారో చూడాలి. షూటింగ్ ప్లాన్ ప్రకారం జరిగితే  2020 మార్చి 25నసినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు!