తన పాటలతో గాయనిగా సౌత్ ఇండియాలో ఎనలేని గుర్తింపు దక్కించుకున్న సింగర్ చిన్మయి శ్రీపద. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చిన్మయి ఆడియెన్స్ ని ప్రేమగా ఆకట్టుకుంటోంది. అయితే ఆమె ఎక్కువగా వివాదాల కారణంగా ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పటికపుడు సామజిక అంశాలపై మీటూ వివాదాలతో హడావుడి చేస్తుంటారు.

ఇక కొన్నిసార్లు ఆడియెన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ కూడా అంటుకుంటూ ట్రోలింగ్ కి గురవుతున్నారు. అయితే ఇటీవల ఆమె మరో సరికొత్త రాగాన్ని అందుకుంది. ఎలక్షన్స్ వైపు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. త్వరలో చెన్నైలో జరగనున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఎలక్షన్స్ లో చాలా మంది ప్రముఖులు కంటెస్టెంట్స్ గా పోటీకి సిద్ధమయ్యారు.  అయితే అందులో చిన్మయి కూడా పోటీ పడనున్నట్లు క్లారిటీ వచ్చేసింది.

చెన్నైలో ఆమె నామినేషన్ కి సంబందించిన ప్రక్రియను కూడా పూర్తి చేసుకుంది. దీంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తుండడంపావు సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో పలు రచయితలపై మీటూ ఆరోపణలు చేసి హాట్ టాపిక్ గా నిలిచిన చిన్మయి ఇప్పుడు ఏకంగా తమిళ సినీ వర్గాలకు షాకిచ్చే నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఆమె తమిళ సినీ రాజకీయాల్లో ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.