బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా మరొకసారి వివాదాస్పద కేసులో ఇరుక్కున్నారు. గోల్డ్ స్కీమ్ పేరుతో తనను మోసం చేశారని ఒక ఎన్నారై పోలీసులకు పిర్యాదు చేయడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని ఖర్ పోలీసులకు సచిన్ జోషి అనే ఎన్నారై ఈ విధంగా పిర్యాదు చేశారు. శిల్పా శెట్టి దంపతులు 2014లో సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కి డైరెక్టర్లుగా వ్యవహరించినట్లు చెప్పాడు. అయితే  ఆరేళ్ళ క్రితం స్టార్ చేసిన ఓ గోల్డ్ స్కీమ్ ని నమ్మి రూ.18.58 లక్షలతో కిలో బంగారం కొన్నట్లు చెప్పాడు.

ఐదేళ్ల కాలపరిమితిలో కిలో బంగారం కొంటే ఓ గోల్డ్ కార్డ్ ఇచ్చి స్కీం ముగిసిన అనంతరం దాన్ని మార్చుకుంటే (రిడీమ్) నూతన బంగారం ఇస్తామని చెప్పినట్లు సచిన్ తెలియజేశాడు.  ఇటీవల టైమ్ పిరియడ్ ముగియడంతో ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న సత్యయుగ్ కంపెనీ ఆఫీస్ వెళితే అక్కడ ఆఫీస్ క్లోజ్ అనే బోర్డు కనిపించింది. అది చూసి షాకైన సచిన్ జోషి వెంటనే పోలీసులను ఆశ్రయించి శిల్పా శెట్టి దంపతులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసుపై శిల్పా శెట్టి దంపతులు స్పందించాల్సి ఉంది.