క్రేజీ బ్యూటీ శ్రీయ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికి శ్రీయ పలు చిత్రాల్లో నటిస్తూనే ఉంది. టాలీవుడ్ అగ్ర నటులందరి సరసన ఆమె నటించింది. హీరోయిన్లకు ఉండే క్రేజ్ తో తమ ఉత్పత్తులకు కార్పొరెట్ సంస్థలు ప్రచారం కల్పించుకోవడం చూస్తూనే ఉన్నాం. 

అలాగే పలు ఈవెంట్స్ కి కూడా హీరోయిన్లని ఆహ్వానిస్తారు. హీరోయిన్లు వస్తే ఆ గ్లామరే వేరు. హీరోయిన్లకు ఉండే క్రేజ్ ఆధారంగా చిత్ర పరిశ్రమలో అనేక ఘరానా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్స్, మేనేజర్స్ అని చెప్పుకుని తిరిగే కొందరు ఆన్లైన్ వేదికగా మోసాలకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. 

ఇదిలా ఉండగా ఇటీవల హీరోయిన్ శ్రీయ పేరు చెప్పి ఓ విలేఖరి మోసానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖు ఛానల్ రియాలిటీ షో నిర్వహించేందుకు చంద్రాయుడు అనే వ్యక్తి ప్లాన్ చేసుకున్నాడు. ఏ షోకు ఎవరైనా ప్రముఖ హీరోయిన్ ని హోస్ట్ గా పెడితే బావుంటుందని భావించాడు. 

అందుకోసం ప్రయత్నాలు చేస్తుండగా చంద్రాయుడుకి ఓ విలేఖరి పరిచయమయ్యాడు. తనకు హీరోయిన్ శ్రీయ మేనేజర్ సింధూజ తెలుసు అని, ఆమె ద్వారా శ్రీయని ఈ షోకు రప్పిస్తాన్ని మాట ఇచ్చాడు. కానీ దాని కోసం రూ50 లక్షలు ఖర్చవుతుందని తెలిపాడు. 

అనుకున్నట్లుగానే సింధూజని ఓ హోటల్ కి రప్పించి చర్చలు జరిపారు. శ్రీయని తాను ఒప్పిస్తానని సింధూజ తెలిపింది. దీనితో సింధూజకు చంద్రాయుడు రూ5 లక్షలు ఇచ్చాడు. కానీ నెలరోజులు గడిచినా శ్రియ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సింధూజ కానీ, విలేఖరి కానీ కనిపించకుండా వెళ్లిపోయారు. దీనితో చంద్రాయుడు లబోదిబో మంటూ బంజారా హిల్స్ పోలీసులని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.