సీనియర్ హీరోయిన్ ఛార్మి కౌర్ హీరోయిన్ గా సినిమాలు తగ్గించేసి ప్రొడక్షన్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే.  పైసా వసూల్ తోడిజాస్టర్ అందుకున్న ఛార్మి పూరితో పాటు తను కూడా డబ్బులు పోగొట్టుకుంది. మెహబూబా సమయంలో కూడా ఆ డే జరిగింది. పూరి ఛార్మికి డబ్బులు తిరిగి ఇచ్చేసినట్లు ఒక టాక్ కూడా వచ్చింది. అయితే ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ హిట్ అందుకొని రికవర్ చేసుకుంది.

ఆ సినిమా క్లిక్కవ్వడంతో మంచి కారయు కూడా కొనుక్కుంది. ఇక ఇప్పుడు హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ సినిమాలను కూడా కూల్  గా సెలెక్ట్ చేసుకుంటోంది. ఇక సినిమాల సంగతి పక్కనపెడితే ఈ సీనియర్ హీరోయిన్ గ్లామర్ విషయంలో మాత్రం కొంచెం కూడా అశ్రద్ధ వహించడం లేదని అనిపిస్తోంది. ప్రొడ్యూసర్ అయినా అందాల పొగరు తగ్గలేదని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ఫొటోలో ఛార్మి టాప్ డ్రెస్ తో సెక్సీగా నిలబడి ఇచ్చిన స్టిల్ నెటిజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. కాలిపై ఎదో అందమైన టాటూ కొటేషన్ కూడా ఇచ్చినట్లు అర్ధమవుతోంది.  నటనకు దూరమైన కూడా ఆమె అందంలో ఏ మాత్రం మార్పు రాలేదు. నటనపరంగా - గ్లామర్ పరంగా ఛార్మి ఏనాడూ నెగిటివ్ కామెంట్స్ ని అందుకోలేదు.

ఆమె నటించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఛార్మి ఆ సినిమాలకు తగిన న్యాయం చేసిందనే చెప్పాలి. ఇక సినిమాల్లో ఇప్పట్లో నటించే అవకాశం లేదని అమ్మడు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ పై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అవకాశాలు తగ్గడంతో సినిమాలో డబ్బు ఇన్వెస్ట్ చేస్తోందని టాక్ వచ్చింది. కానీ ఛార్మికి స్పెషల్ రోల్స్ చాలానే వస్తున్నాయట. కానీ అమ్మడు మాత్రం ప్రొడ్యూసర్ గా కొన్నాళ్లపాటు వర్క్ ని ఎంజాయ్ చేసి డబ్బులు వెనకేసుకోవాలని చూస్తోంది.