సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం చంద్రముఖి. ఆప్తమిత్ర సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు పీ వాసు దర్శకుడు. రజనీకాంత్ మానసిక వైధ్యుడిగా నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ప్రభు, జ్యోతికలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కేవలం తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా రికార్డ్ లు సృష్టించింది చంద్రముఖి. అప్పటి వరకు వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్నరజనీ  ఈ సినిమాతో ఫాంలోకి వచ్చాడు.

అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగులో నాగవళ్లి పేరుతో వెంకీ ఓ సీక్వెల్ చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అదే సమయంలో చంద్రముఖి కథతో సినిమా చేసి నటులకు ఆరోగ్య పరంగా సమస్యలు ఎదురవుతున్నాయన్న పుకార్లు రావటంతో రజనీ, సీక్వెల్‌లో నటించేందుకు నో చెప్పేశాడు. చాలా రోజుల తరువాత ఇప్పుడు మరోసారి చంద్రముఖి సీక్వెల్‌ తెర మీదకు వచ్చింది.

కోలీవుడ్‌ హీరో, దర్శకుడు లారెన్స్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడు. అంతేకాదు ఆ పాత్రలో నటించేందుకు రజనీ పర్మిషన్‌ కూడా తీసుకున్నట్టు వెల్లడించాడు లారెన్స్‌. వరుసగా హార్రర్‌ సినిమాలు చేస్తున్న లారెన్స్ ఇప్పటి వరకు ఎక్కువగా స్వీయ దర్శకత్వంలోనే హర్రర్ సినిమాలు చేశాడు లారెన్స్‌. కానీ చంద్రముఖి సీక్వెల్‌కు మాత్రం పీ వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం  ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమా పరిస్థితులు చక్కబడిన తరువాత సెట్స్‌ మీదకు వెళ్లనుంది.
Raghava Lawrence donates Rs. 3 Cr. Towards Corona Relief! Tamil ...